Site icon HashtagU Telugu

AP : ఢిల్లీలో మోడీ..అమిత్ షా కాళ్ళు పట్టుకోవడానికి లోకేష్ తిరుగుతున్నాడు – మంత్రి రోజా

Minister Roja Comments On N

Minister Roja Comments On N

వైసీపీ మంత్రి రోజా మరోసారి చంద్రబాబు , లోకేష్ లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయినా సంగతి తెలిసిందే. అలాగే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు లో తాజాగా CID అధికారులు లోకేష్ పేరును ఏసీబీ కోర్ట్ లో పొందుపరిచారు. ఈ తరుణంలో మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు చేసారు. లోకేష్ ను ఎక్కడ అరెస్ట్ చేస్తారో అని భయపడి రాష్ట్రం వదిలిపారిపోయాడని..ఢిల్లీలో ప్రధాని మోడీ ( (PM Modi), అమిత్‌షా (Amit shah) కాళ్ళు పట్టుకోవడానికి తిరుగుతున్నారని రోజా వ్యాఖ్యానించారు.

అడ్డంగా దొరికిన చంద్రబాబును కాపాడేందుకు ఎవరూ సిద్ధంగా లేరని , అందుకే మోడీ, అమిత్‌షా అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. లోకేష్ రాష్ట్రపతిని కలిసి తప్పు చేసిన తన తండ్రిని కాపాడాలని కోరుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం లోకేష్ (Nara lokesh) ఎప్పుడైనా రాష్ట్రపతిని కలిశారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు స్కిల్ డెవెలప్‌మెంట్ సహా అమరావతి, ఫైబర్ నెట్ వంటి అనేక స్కాంలు చేశారని రోజా (Minister RK Roja) గుర్తు చేశారు.

రోడ్డు వేయకముందే ఇన్నర్ రింగ్ రోడ్ ఎలైన్‌మెంట్ పేరుతో దోచుకున్నారు. ఆరు నెలల్లో రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని లోకేష్ చెప్తుంటే అందరూ నవ్వుతున్నారని రోజా అన్నారు. స్కాంలలో ఇరుక్కుని లోకేష్ ఢిల్లీ పారిపోయారని రోజా ఎద్దేవా చేశారు. కాళ్ళ నుంచి కళ్ళ వరకూ భయంతో వణికిపోతున్నారన్నారు. ఎర్రబుక్‌లో రసుకుంటానని బెదిరిస్తున్న లోకేష్.. సీఐడీ మెమోలో ఆయన పేరు రాసారని గుర్తుచేసుకోవాలని వ్యాఖ్యానించారు.

మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు. మీ అధినేత జగన్ ఫై ఎన్ని కేసులు ఉన్నాయి..సీబీఐ ఎన్ని కోట్ల ఆస్తిని జప్తు చేసింది..ఎన్ని నెలలు జైల్లో ఉన్నారు అని ప్రశ్నిస్తున్నారు. మా అధినేత ఫై కేవలం ఆరోపణలే ఉన్నాయని..మీ అధినేత సాక్ష్యాలతో పట్టుబడ్డాడని గుర్తు చేస్తున్నారు. మరోసారి జగన్ జైలు కు వెళ్ళడం ఖాయమని హెచ్చరిస్తున్నారు.

Read Also : Group 1 Exam : గ్రూప్ 1 పరీక్ష మళ్లీ పెట్టాల్సిందే.. హైకోర్టు డివిజన్ బెంచ్ సంచలన తీర్పు