Jagananna Sports Club APP : జగనన్న స్పోర్ట్స్ క్లబ్ యాప్ ను ప్రారంభించిన మంత్రి ఆర్.కే.రోజా

రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క క్రీడాకారుడిలో ఉన్న నైపుణ్యాన్ని ప్రపంచాన్నికి తెలియచేయడమే జ‌గ‌నన్న ప్రభుత్వం ‌లక్ష్యమ‌ని....

Published By: HashtagU Telugu Desk
minister RK roja

minister RK roja

రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క క్రీడాకారుడిలో ఉన్న నైపుణ్యాన్ని ప్రపంచాన్నికి తెలియచేయడమే జ‌గ‌నన్న ప్రభుత్వం ‌లక్ష్యమ‌ని మంత్రి ఆర్‌కే రోజా తెలిపారు. సచివాలయంలోని తన చాంబర్ లో మంత్రి క్రీడలు, శాప్ శాఖలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జగనన్న స్పోర్ట్స్ యాప్ ను మంత్రి ప్రారంభించారు. ప్రతి గ్రామంలో జగనన్న స్పోర్ట్స్ క్లబ్‌లు ఏర్పాటు, రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి, జగనన్న స్పోర్ట్స్ యాప్ ను రాష్ట్రంలో ఉన్న క్రీడకారులు ఉపయోగించుకునే విధానం, నూతన స్పోర్ట్స్ పాలసీ సవరణలపై మంత్రి ఆర్.కే.రోజా అధికారులతో సమీక్షించారు.

కొన్ని జిల్లాలో పెండింగ్ లో ఉన్న సీఎం కప్ టోర్నమెంట్ లను త్వరగా నిర్వహించాలని మంత్రి రోజా అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి ఆర్.కే.రోజా మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిభ ఉన్న ప్రతి ఒక్క క్రీడకారుడికి ప్రోత్సాహం అందించి వారిని ఆ క్రీడలో విజేతగా నిలపడం జగనన్న లక్ష్యమ‌ని తెలిపారు. నూతనంగా లాంచ్ చేసిన జగనన్న స్పోర్ట్స్ క్లబ్ యాప్ ను విస్తృతంగా ప్రచారం చేసి రాష్ట్రంలో ప్రతిభ ఉన్న ప్రతి ఒక్క క్రీడాకారుడు దీనిలో సమాచారం పొందుపరిచేలా అధికారులు పనిచేయాలని మంత్రి సూచించారు. క్రీడాకారులు కూడా ఈ యాప్ ను ఉపయోగించుకొని తమ తమ ప్రతిభలను, తమ క్రీడకు సంబంధించిన సమాచారాన్ని పొందపరచడం వల్ల ప్రభుత్వం క్రీడాశాఖ ద్వారా వారికి మరింత మంచి ప్రోత్సాహకాలు అందించేందుకు వీలవుతుందని మంత్రి పేర్కొన్నారు. క్రీడా మైదానాలు నిర్మాణం, నిర్వహణలపై అధికారులతో ఈ సమావేశంలో మంత్రి ఆర్.కే.రోజా చర్చించారు…

 

  Last Updated: 08 Sep 2022, 07:48 AM IST