Minister Rk Roja: టీడీపీది పగటికలే.. ప్రజలు జగనన్నని మరోసారి కోరుకుంటున్నారు: మంత్రి రోజా

ఏపీలో వచ్చే ఏడాది రాష్ట్ర ఎన్నికలు జరగనున్న విషయం మనందరికీ తెలిసిందే. దాంతో ఇప్పటికే ఆయా పార్టీలు

  • Written By:
  • Publish Date - March 21, 2023 / 06:10 PM IST

ఏపీలో వచ్చే ఏడాది రాష్ట్ర ఎన్నికలు జరగనున్న విషయం మనందరికీ తెలిసిందే. దాంతో ఇప్పటికే ఆయా పార్టీలు ప్రచార కార్యక్రమాలను కూడా మొదలుపెట్టాయి. కాగా వచ్చే ఎన్నికలలో టిడిపి, వైసిపి, జనసేన పార్టీలలో ఏ పార్టీ గెలుస్తుంది అంతే చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే జనసేన విషయం పక్కన పెడితే టిడిపి వైసిపి మధ్య పోటీ హోరాహోరీగా జరుగుతోంది. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికలలో టిడిపి ప్రభంజనం సృష్టించడంతో వచ్చే ఏడాది కచ్చితంగా టిడిపి నే గెలుస్తుంది అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇది ఇలా ఉంటే వైసిపి మంత్రి రోజా రాజాగా తిరుపతి మీడియాతో మాట్లాడుతూ టిడిపి పార్టీ గురించి టిడిపి నాయకుల గురించి పలు వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా రోజా మీడియాతో మాట్లాడుతూ.. జగనన్న వన్స్ మోర్ అని అంటున్నారు. వచ్చే ఏడాది అధికారంలోకి వస్తాము అనేది టిడిపి పగటి కలే అని తెలిపింది రోజా. 2019 నుండి ఎక్కడ గెలవకపోవడంతో టిడిపి నాయకులు పిచ్చెక్కిపోయారు. శవాల నోట్లో తులసి తీర్థం పోసిన విధంగా టిడిపికి అనుకోకుండా కేవలం 3 ఎమ్మెల్సీలు మాత్రమే వచ్చాయి. ఎమ్మెల్సీలు సొంత ఓట్లు సింబల్ తో గెలవలేదు అయినా పెద్దగా ఘనకార్యం సాధించినట్లు సంబరాలు చేసుకుంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని తెలిపింది.

కానీ వాళ్ళ అహంకారం కలిగిన నెత్తికెక్కి అసెంబ్లీలో స్పీకర్ ను అవమానించి దాడి చేయడం దురదృష్టకరం అంటూ రోజా ఆగ్రహం వ్యక్తం చేసింది. బీసీ కులానికి చెందిన స్పీకర్ ను అవమానించి దాడికి ప్రయత్నించడం ఎంతవరకు సబబు అంటూ ఆమె ప్రశ్నించింది. అలాగే చేసిన తప్పును సమర్థించుకోవడం కోసం మా నాయకుల పై నిందలు వేయడం సిగ్గుచేటు అని అన్న ఆయన టిడిపి అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ జాతి వాళ్లకు పదవులు ఇస్తారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దళితులను ముందు పెట్టి అన్యాయం చేస్తున్నామని చెప్పడం చాలా దురదృష్టకరం అని తెలిపింది రోజా. జీవో నెంబర్ వన్ కోసం తీర్మానం ఇచ్చిన టిడిపి ఎప్పుడైనా ప్రజల సమస్యల కోసం వాయిదా తీర్మానం ఇచ్చిందా అని రోజా నిలదీసింది. వాళ్లకు ఎమ్మెల్సీలు వస్తే ఏం జరగదు. 2024లో జగనన్న వన్స్ మోర్ అని ప్రజలు అంటున్నారు. టీడీపీ అధికారంలోకి రావడం పగటికలే అని తెలిపింది రోజా. కాకుండా టీడీపీ నాయకులు నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది అని హెచ్చరించింది మంత్రి రోజా.