Site icon HashtagU Telugu

Minister Roja : దేశంలో అతిపెద్ద ఆర్థిక‌ ఉగ్ర‌వాది చంద్ర‌బాబే : మంత్రి రోజా

Minister Roja Chandrababu

Minister Roja Chandrababu

టీడీపీ అధినేత చంద్రబాబు దేశంలో అతిపెద్ద ఆర్థిక ఉగ్ర‌వాది అని మంత్రి రోజా ఆరోపించారు . రూ.241 కోట్లు కొల్లగొట్టి చంద్ర‌బాబు అడ్డంగా దొరికి పోయార‌ని.. చంద్రబాబు అరెస్ట్ ను ప్రజలు పట్టించుకోవడం లేదని మంత్రి రోజా తెలిపారు.బోగస్ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబ‌ని.. సాక్ష్యాలు దొరికాయి కాబ‌ట్టే చంద్ర‌బాబుని రిమాండ్‌కు పంపిచార‌న్నారు. చంద్రబాబు అవినీతి బురదలో కూరుకుపోయిన ముత్యమ‌ని.. కక్ష సాధించాలి అనుకుంటే 2021 లోనే ఈ కేసు టేకఫ్ చేశార‌ని అప్పుడే అరెస్ట్ చేసేవాళ్ల‌మ‌ని మంత్రి రోజా తెలిపారు. వై.ఏస్.ఆర్ కన్న కలలు నిజం చేయాలి అని సీఎం జగన్ సుపరిపాలన అందించారన్నారు. ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చిన ఘనత సీఎం జగన్‌దేన‌ని.. సోనియా గాంధీ సూచనతో తెల్ల పేపర్ పై సంతకం పెట్టించడం కక్ష సాధింపు కాదా అని రోజా ప్ర‌శ్నించారు. ఈ కుంభ కోణం తో సంబంధం లేదని చంద్రబాబు, ప్రత్యేక విమానంలో తీసుకు వచ్చిన లాయర్ లుధ్ర ఏమైనా మీకు చెప్పరా అని ప్ర‌శ్నించారు. కేంద్రం ప్రభుత్వం ఆదేశంతో ఈ కేసు విచారణ జరుగుతోందని మంత్రి రోజా తెలిపారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేసే చంద్రబాబు అడ్డంగా దొరికారని.. పట్టిసీమ, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ గ్రిడ్ కేసుల్లో చంద్రబాబు అరెస్ట్ అవుతార‌ని రోజా తెలిపారు. టీడీపీ ద‌త్త‌పుత్రుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ నోరు అదుపులో పెట్టుకోవాల‌ని హెచ్చరించారు. చంద్రబాబు అరెస్ట్ తో ప్రకృతి పులకించి పోయింది..జోరున వర్షం కురిసిందన్నారు.

Exit mobile version