Site icon HashtagU Telugu

Mohan Babu: మోహ‌న్ బాబు రూటే స‌ప‌రేట్!

Perni Nani Mohanbabu

Perni Nani Mohanbabu

ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫి మంత్రి పేర్ని నాని, నేడు సినీనటుడు మోహన్ బాబును క‌లిశారు. ఒక‌రేమో ముక్కు సూటిగా మాట్లాడ‌తారు.. మ‌రొక‌రేమో త‌న వాక్ చాతుర్యంతో ప్ర‌త్య‌ర్ధ‌ల‌ను ముప్పు తిప్ప‌లు పెడ‌తారు. ఈ క్ర‌మంలో ఈ ఇద్ద‌రి మీటింగ్ పై స‌ర్వ‌త్రా ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడి వివాహానికి వచ్చిన మంత్రి పేర్ని నాని, ఈరోజు మోహన్ బాబు ఇంటికి వెళ్ళారు. ఈ క్ర‌మంలో ఇద్ద‌రు టాలీవుడ్ సమస్యలపై చర్చించినట్లు తెలిసింది.

గురువారం సీఎం జ‌గ‌న్‌తో సినీ ప్రమఖులు భేటీలోజ‌రిగిన విష‌యాలు గురించి మోహ‌న్ బాబుకు పేర్ని నాని వివరించినట్టుగా తెలుస్తోంది. ఈ క్ర‌మంలో సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యల పట్ల ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ సానుకూలంగా స్పందించారని, దీంతో త్వరలోనే అన్ని స‌మ‌స్య‌లు పరిష్కారం కానున్నాయని పేర్ని నాని, మోహ‌న్ బాబుకు తెల్పిన‌ట్టు స‌మాచారం. ఇక‌పోతే జ‌గ‌న్‌తో టాలీవుడ్ సెల‌బ్స్ మీటింగ్‌కు మోహ‌న్ బాబుకు ఆహ్వానం అంద‌లేద‌నేదని ప‌లు మీడియ‌ల్లో వార్త‌లు వ‌చ్చాయి.

మంచు కుటుంబాన్ని జ‌గ‌న్ దూరం పెట్టార‌ని వార్త‌లు సినీ వ‌ర్గాల్లో జోరుగా చ‌క్క‌ర్లు కొడుతున్నారు. ఈ నేప‌ధ్యంలో టాలీవుడ్‌లో కీల‌కంగా ఉన్న మోహ‌న్ బాబును క‌ల‌వాల‌ని, సీఎం జ‌గ‌న్ ఇచ్చిన ఆదేశం మేర‌కు పేర్నినాని మోహ‌న్ బాబును క‌ల‌సిన‌ట్లు స‌మాచారం. గురువారం కొంద‌రు సినీ పెద్ద‌లు, ఇండ‌స్ట్రీ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం సీఎం జ‌గ‌న్ వ‌ద్ద‌కు వెళితే.. మోహ‌న్ బాబు మాత్రం ఏకంగా సినిమాటోగ్ర‌ఫీ మంత్రి అయిత‌న పేర్ని నానిని త‌న ఇంటికి ర‌ప్పించుకుని చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డం హాట్ టాపిక్‌గా మారింది. ఏది ఏమైనా మోహ‌న్ బాబు రూటే స‌ప‌రేటు అంటూ చ‌ర్చించికుంటున్నారు సినీ జ‌నాలు.