AP Pre Polls: ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం లేదు; పెద్దిరెడ్డి

ఆంధ్రప్రదేశ్ లో రానున్న ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి. గత ఎన్నికల్లో భారీ మెజారీటీతో గెలుపొందిన వైసీపీ అధికారాన్ని చేపట్టింది. 21 సీట్లకే పరిమితమైన టీడీపీ రానున్న

AP Pre Polls: ఆంధ్రప్రదేశ్ లో రానున్న ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి. గత ఎన్నికల్లో భారీ మెజారీటీతో గెలుపొందిన వైసీపీ అధికారాన్ని చేపట్టింది. 21 సీట్లకే పరిమితమైన టీడీపీ రానున్న ఎన్నికలను సవాల్ గా తీసుకుంది. మరోవైపు జనసేన పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా అవతరించింది. దీంతో ఈ సారి ఎన్నికలు రసవత్తరంగా సాగనున్నాయి. ఇదే సమయంలో గత కొంతకాలంగా ముందస్తు ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలో ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. పొత్తుల విషయానికి వస్తే.. ఏపీలో జనసేన-టీడీపీ పొత్తు అంశం ఖరారైనట్లుగానే తెలుస్తుంది. మరోవైపు బీజేపీ జనసేనతోనే ఉన్నామంటూ చెప్పుకుంటుంది.

ఏపీలో ముందస్తు ఎన్నికల ప్రచారంపై ఆ రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి క్లారిటీ ఇచ్చారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం వైసీపీకి లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం సీఎం జగన్ నాయకత్వంలో వైసీపీ పార్టీ బలంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. ప్రజల్లో వైసీపీ నినాదం తప్ప మరేదీ లేదన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి వస్తాయని స్పష్టం చేశారు. ఇక మాకు ఎవరితో పొత్తు అవసరం లేదని తేల్చేశారు మంత్రి పెద్దిరెడ్డి.

Read More: G. V. Prasad: అంజిరెడ్డి అడుగు జాడల్లో నడుస్తూ, ఫార్మాను కొత్త పుంతలు తొక్కిస్తూ!