Site icon HashtagU Telugu

Minister Nimmala : కూలీలా మారిన ఏపీ మంత్రి

Minister Nimmala Ramanaidu

Minister Nimmala Ramanaidu

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు ఆదివారం శ్రమదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. గౌడ, శెట్టిబలిజ సమాజాల కోసం నిర్మిస్తున్న కళ్యాణ మండపం స్లాబ్ పనుల్లో ఆయన స్వయంగా కూలీలా మారి శ్రమించారు. చేతితో మిశ్రమం కలుపుతూ, సిమెంట్ ఎత్తిపోస్తూ పనివారితో కలిసి చెమటలు చిందించారు. ప్రజా సేవ అనేది కేవలం కార్యాలయాల్లో కూర్చుని సంతకాలు చేయడం కాదని, అభివృద్ధి పనుల్లో ప్రత్యక్షంగా పాల్గొనడమే నిజమైన సేవ అని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Mukesh Ambani : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ముకేశ్ అంబానీ

నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, పాలకొల్లులో జరుగుతున్న కళ్యాణ మండప నిర్మాణం టిడిపి ప్రభుత్వంలో ప్రారంభమైందని గుర్తుచేశారు. “మేము అప్పట్లో రూ.1.50 కోట్లతో మొదటి స్లాబ్ వరకు పనులు పూర్తి చేశాం. కానీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఆ పని ఒక్క అడుగు ముందుకు పోలేదు. నలుగురి మేలుకోసం చేపట్టిన ప్రాజెక్టులను అడ్డుకోవడం ఆ ప్రభుత్వ విధానమైపోయింది” అని ఆయన విమర్శించారు. ప్రజల డబ్బుతో జరుగుతున్న పనుల్లో రాజకీయ పక్షపాతం చూపడం దురదృష్టకరమని తెలిపారు.

ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఈ కళ్యాణ మండపం పనులు వేగంగా సాగుతున్నాయని మంత్రి వివరించారు. రూ.3 కోట్ల వ్యయంతో స్లాబ్ పనులు పూర్తిచేసి త్వరలో భవనాన్ని ప్రజల సేవకు అందించనున్నట్లు తెలిపారు. ఈ భవనం సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలకు కేంద్ర బిందువుగా మారుతుందని పేర్కొన్నారు. “ప్రజల సౌకర్యం కోసం ఎన్ని కష్టాలైనా భరిస్తాం. పాలకొల్లును ఆధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దడమే మా లక్ష్యం” అని నిమ్మల రామానాయుడు హామీ ఇచ్చారు.

Exit mobile version