Site icon HashtagU Telugu

YS Jagan : జగన్‌ చేసిన పాపాలే ప్రజల మెడకు ఉరితాళ్లు : మంత్రి నిమ్మల

minister nimmala ramanaidu accused jagan of destroying ap

minister nimmala ramanaidu accused jagan of destroying ap

Minister Nimmala Ramanaidu : తూర్పుగోదావరి జిల్లాలో మంత్రి నిమ్మల రామానాయుడు రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాజీ సీఎం జగన్‌ చేసిన పాపాలు ప్రజలను వెంటాడుతున్నాయని అన్నారు. ఏపీ మీద రూ.14 లక్షల కోట్ల అప్పు ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. ఈ విషయాన్ని కూటమి నేతలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.

గత ఐదేళ్లలో జగన్ చేసిన పాపాలే ప్రజలపై భారం రూపంలో వెంటాడుతున్నాయని చెప్పారు. గత ప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్ల రేట్లను దాచి చీకటి జీవోలు ఇచ్చి ప్రజలపై భారం మోపిందన్నారు. కేవలం ఐదేళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యిందని, సీఎం చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే పనిలో ఉన్నారని వివరించారు. రాజమండ్రి శుభమస్తు కల్యాణ మండపంలో కూటమి నాయకులతో భేటీ అయిన మంత్రి.. రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, సాగునీటి సంఘాలతో పాటు కో-ఆపరేటివ్ సొసైటీ ఎన్నికలపై సమీక్ష నిర్వహించారు.

కాగా, జగన్‌ ప్రభుత్వంలో వడ్డించాల్సిన చార్జీలను ఇప్పడి దాకా వాయిదా వేసి తప్పుడు రాతలు రాస్తున్నారు. ప్రజలపై రూ. 6,072.86 కోట్ల భారం మోపండని ఈ ఆర్సీకి ఇచ్చింది..జగన్‌ ప్రభుత్వమే. ప్రజల సొమ్మును ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టడమే కాకుండా, ఆ సొమ్మును ప్రజలపై మోపండని కమిషన్‌కు చెప్పింది కూడా జగన్‌ రెడ్డే. కమిషన్‌ నిర్ణయం ఆలస్యం కారణంగా ఆ మొత్తం చంద్రబాబు ప్రభుత్వంలో కట్టాల్సి వస్తోంది. లాభాపేక్షంతోనే జగన్‌ అక్రమ విద్యుత్‌ కొనుగోళ్లు, పీపీఏల రద్దు చేశాడు. జగన్‌ అస్మదీయులకు డబ్బులు విచ్చలవిడిగా పంచిపెట్టేందుకు గానూ..వైఎస్‌ఆర్‌సీపీ హయంలో ఏపీ జెన్కోలో విద్యుదుత్పత్తిని తగ్గించారు. ప్రజావసరాల పేరుతో జగన్‌ పరివారం దగ్గర విద్యుత్‌ను అధిక ధరలకు కొనుగోలు చేశారు. కేవలం విద్యుత్‌ కొనుగోళ్లు మాత్రమే కాకుండా బొగ్గు కొనుగోళ్ల వ్యవహారం అంతి కూడా రహస్యంగా జన్‌ నడిపించారు. జగన్‌ హయాంలోనే డిస్కంటు రూ.8,114 కోట్లు వసూలు చేసుకుంటామని అడిగిని ప్రజా వ్యతిరేఖతకు బయపడి వెనక్కి తగ్గింది నాటి ప్రభుత్వం

Read Also: Flights : రేపటి నుంచి విశాఖ టు విజయవాడకు మరో 2 విమాన సర్వీసులు