Site icon HashtagU Telugu

Minister Narayana : కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో మంత్రి నారాయణ భేటీ

Minister Narayana meet Union Minister Manoharlal Khattar

Minister Narayana meet Union Minister Manoharlal Khattar

Union Minister Manoharlal Khattar : ఏపీ మంత్రి నారాయణ రెండో రోజు ఢిల్లీ పర్యటన కోనసాగుతుంది. ఈ క్రమంలోనే ఆయన ఈరోజు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో మంత్రి నారాయణ, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నారాయణ విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులు ముందుకు తీసుకువెళ్లే అంశాలపై కీలకంగా చర్చించారు.

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించిన రెండు ప్రాజెక్టులపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని మంత్రి నారాయణ కోరారు. విజయవాడ మెట్రోను రాజధాని అమరావతికి అనుసంధానించే ప్రతిపాదనలు కూడా ఇప్పటికే కేంద్రానికి పంపినట్లు ఖట్టర్ దృష్టికి నారాయణ తీసుకెళ్లారు. అమృత్ 2 పథకం గత ఐదేళ్లుగా రాష్ట్రంలో అమలుకు నోచుకోలేదని..ఆ పథకాన్ని ఇప్పుడు అమలుకు ఉన్న మార్గాలపై ఇరువురు మధ్య కీలక చర్చ జరిగినట్లు తెలిసింది. మంత్రి నారాయణ ప్రతిపాదనలపై కేంద్రమంత్రి ఖట్టర్ సానుకూలంగా స్పందించారు.

కాగా, ఢిల్లీ పర్యటనలో ఏపీ మంత్రులు, పలువురు ఉన్నతాధికారులు బిజీబిజీగా ఉన్నారు. గత మూడు రోజులుగా మంత్రులు లోకేష్ , నారాయణ , సత్యకుమార్ ఢిల్లీలోనే ఉన్నారు. ఇందులో భాగంగా పలువురు కేంద్రమంత్రులను, మంత్రిత్వశాఖల ఉన్నతాధికారులను మంత్రులు కలుస్తున్నారు. నిన్న (సోమవారం) హడ్కో అధికారులతో ఏపీ పట్టణాభివృద్ధి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ భేటీ అయ్యారు. ఈరోజు (మంగళవారం) పట్టణాభివృద్ధి శాఖమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సహా ఉన్నతాధికారులతో నారాయణ బృందం సమవేశంఅయింది.

Read Also: Musi : తాము మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకం కాదు..చేస్తున్న పద్ధతికి వ్యతిరేకం: ఈటల