ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి నారాయణ (Minister Narayana) విశాఖ మెట్రో రైల్ (Visakhapatnam Metro Rail Project) విషయంలో గుడ్ న్యూస్ అందించారు. త్వరలోనే మెట్రో రైలు ప్రాజెక్టును ప్రారభించనునున్నట్లు అసెంబ్లీ సాక్షిగా మంత్రి తెలిపారు. బుధవారం ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవగా.. స్పీకర్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఈ సందర్భంగా విశాఖ మెట్రో రైల్‌పై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి ఈ మేరకు సమాధానం ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో నేడు (ఈ రోజు) 3 బిల్లులు ప్రవేశపెట్టబోతున్నారు. సోమవారం సమావేశాలు ప్రారంభం కాగా.. ఈరోజు ఉదయం 9 గంటలకు క్వచ్చన్ అవర్‌తో అసెంబ్లీ ప్రారంభం అయ్యింది. ముందుగా అసెంబ్లీలో డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్ స్వయంగా ఏపీ పంచాయితీ రాజ్ బిల్లు-2024 ప్రవేశ పెట్టారు. ఆ తర్వాత మంత్రి నారాయణ ఏపీ మున్సిపల్ బిల్లు- 2024 బిల్లును, మంత్రి పయ్యావుల కేశవ్ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల బిల్లు-2024ను ప్రవేశపెట్టనున్నారు.
ఈ సందర్భంగానే ప్రశ్నోత్తరాల సెషన్ కూడా నిర్వహించి.. చింతలపూడి ఎత్తిపోతల పథకం, వీధికుక్కల బెడద.. గ్రామ-వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులు, విశాఖలో మెట్రోరైల్ నిర్మాణం, ఇరిగేషన్ కాలువల ఆధునీకరణ, రాష్ట్రంలో జాతీయ విద్యాసంస్థలు, ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీల భర్తీ, గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయల కల్పన, డీఎస్సీ-1998 అంశాలపై ప్రశ్నోత్తరాలు జరగనున్నాయి. ఆ తర్వాత 2024 -25 ఆర్థిక బడ్జెట్‌పై చర్చ జరుగుతుంది.
ఇక విశాఖ మెట్రో అనేది చిరకాల కోరిక. విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టు ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. రాష్ట్రంలోని ప్రధాన నగరమైన విశాఖపట్నం ప్రజలకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణ వసతులు అందించడానికి ప్రణాళికాబద్ధంగా రూపొందించారు. విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు విశాఖపట్నం నగర పరిధిలో ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా, ట్రాఫిక్ సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. మెట్రో రైల్‌ను మూడు మార్గాల్లో విస్తరించనున్నారు.
NAD జంక్షన్ నుండి గాజువాక వరకు, తూర్పు తీరానికి కనెక్ట్ చేసే మార్గం, మరోదాన్ని నగరంలోని ఇతర ముఖ్య ప్రాంతాలకు విస్తరించనున్నారు. ఈ మెట్రో ప్రాజెక్టు నాన్-పొల్యూషన్, సస్టైనబిలిటీ అంశాలను దృష్టిలో పెట్టుకొని రూపొందించబడింది. ప్రాజెక్టు పర్యవేక్షణకు ప్రభుత్వం ప్రత్యేక సంస్థ ఏర్పాటు చేసి, పనులను వేగవంతంగా కొనసాగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. విశాఖ మెట్రో రైల్ సాధారణ ప్రజలకు, ప్రత్యేకంగా ఉద్యోగులు, విద్యార్థులు, వాణిజ్య క్షేత్రాల్లో ఉండే వారికి అధునాతన రవాణా సౌకర్యాన్ని అందించడంలో తోడ్పడుతుంది.
Read Also : Bulldozer Action : ఆఫీసర్లు జడ్జీలు కాలేరు.. ఇళ్లను కూల్చేసే హక్కులు వాళ్లకు లేవ్ : సుప్రీంకోర్టు