CBG plant : మంత్రి నారా లోకేశ్ ప్రకాశం జిల్లాలో కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్(సీబీజీ) ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. రిలయన్స్ ప్రతినిధులతో కలిసి సీబీజీ ప్లాంట్ భూమి పూజ కార్యక్రమాల్లో లోకేష్ పాల్గొన్నారు. అంతకు ముందు దివాకరపల్లికి చేరుకున్న మంత్రి లోకేష్‌కు టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. మంత్రి లోకేష్ పర్యటన సందర్భంగా అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఏపీలో భారీ ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు అవుతోంది. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పీసీపల్లి మండలం దివాకరపల్లి గ్రామ సమీపంలో సీబీజీ ప్లాంట్‌కు మంత్రి నారాలోకేష్ శంకుస్థాపన చేశారు.
Read Also: Police Notice : మాజీ ఎంపీ హర్షకుమార్ కు పోలీసుల నోటీసులు
రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు బయో ఫ్యూయల్ ఉత్పత్తిలో ఈ ప్రాజెక్టు కీలకంగా మారనుంది. ప్రాజెక్టు కోసం రిలయన్స్ సంస్థ రూ.65 వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ నిధులతో మొత్తం 500 సీబీజీ ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా సుమారు 2.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. భూమి పూజ కార్యక్రమంలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా బాల వీరాంజనేయ స్వామి, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మొత్తంతో 500 వరకు సీబీజీ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నారు. దాదాపు 2.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయని అధికారులు తెలిపారు. దివాకరపల్లి గ్రామ సమీపంలో రిలయన్స్ న్యూ ఎనర్జీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేయనున్న ప్లాంట్ ద్వారా ఏపీకి రూ.65 వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయి.
కాగా, గన్నవరం ఎయిర్‌పోర్టులో రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ పిఎంఎస్ ప్రసాద్ కి, మంత్రి లోకేష్, ఏపీ సీఎస్ విజయానంద్ స్వాగతం పలికారు. అనంతరం రిలయన్స్ బృందం తో కలిసి కనిగిరి బయలుదేరారు. కనిగిరిలోని దివాకరపల్లి గ్రామ సమీపంలో రిలయన్స్ ఏర్పాటు చేయనున్న సీబీజీ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటామని మంత్రి లోకేష్ తెలిపారు. ఈ సీబీజీ ప్లాంట్ ఏర్పాటుతో గ్రామీణ యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు.
Read Also: RCB vs GT: హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన బెంగళూరు.. నేడు గుజరాత్‌తో ఢీ?