Ex MP Ramesh Rathod : మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ మృతి పట్ల మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి

టీడీపీతో ఆయనకు విడదీయరాని అనుబంధం ఉందని, ఈ విషాద సమయంలో రమేశ్ రాథోడ్ గారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని లోకేశ్ పేర్కొన్నారు

Published By: HashtagU Telugu Desk
Adilabad Ex Mp Ramesh Ratho

Adilabad Ex Mp Ramesh Ratho

బీజేపీ నేత, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ (Ex MP Ramesh Rathod ) మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు తో పాటు మంత్రి నారా లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. శుక్రవారం రాత్రి రమేష్ రాథోడ్ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి ఆయన్ని తరలించారు. అయితే శనివారం ఉదయం మెరుగైన వైద్య చికిత్స కోసం కుటుంబ సభ్యులు ఆయన్ని హైదరాబాద్‌కు తరలించారు. ఆ క్రమంలో ఆయన మృతి చెందారు. ప్రస్తుతం రమేష్ రాథోడ్ మృతదేహాన్ని ఆయన స్వగ్రామమైన ఉట్నూరుకు తరలించారు. రేపు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

రమేష్ మరణ వార్త తెలిసి రాజకీయ నేతలు సంతాపం తెలియజేస్తూ వస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు రమేష్ మృతి ఫై స్పందించారు. రమేశ్ రాథోడ్ అకాల మరణం వార్త తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని సీఎం చంద్రబాబు వెల్లడించారు. టీడీపీ నుంచి ఆదిలాబాద్ ఎంపీగా, జడ్పీ చైర్మన్ గా, ఖానాపూర్ ఎమ్మెల్యేగా ఆయన విశేష సేవలు అందించారని , గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ఎంతో కృషి చేసిన ఆయన మరణం తీరని లోటు అని పేర్కొన్నారు. ఈ విషాద సమయంలో వారి కుటుంబ సభ్యులకు బాధాతప్త హృదయంతో ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని వెల్లడించారు. అలాగే మంత్రి లోకేష్ సైతం దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు.

రమేష్ మృతి పట్ల సంతాపం తెలియజేస్తూ, నివాళులు అర్పిస్తున్నానని వివరించారు. టీడీపీతో ఆయనకు విడదీయరాని అనుబంధం ఉందని, ఈ విషాద సమయంలో రమేశ్ రాథోడ్ గారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని లోకేశ్ పేర్కొన్నారు. ఇక రమేష్ రాథోడ్ రాజకీయ ప్రస్థానానికి వస్తే 1999 నుండి 2004 వరకు ఆయన ఖానాపూర్ ఎమ్మెల్యేగా పనిచేశారు. 2006 నుంచి 2009 వరకు ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ గా పని చేశారు. 2009లో టిడిపి నుంచి ఆదిలాబాద్ ఎంపీగా గెలుపొందారు. ఆయన భార్య సుమన్ రాథోడ్ 2009లో ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం రమేష్ రాథోడ్ బిజెపిలో కొనసాగుతున్నారు.

Read Also : Aswani Dutt : కల్కి సెకండ్ పార్ట్ ఫై కీలక అప్డేట్ ఇచ్చిన నిర్మాత అశ్విని దత్

  Last Updated: 29 Jun 2024, 05:43 PM IST