Site icon HashtagU Telugu

Ashok Leyland Plant : అశోక్ లేలాండ్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి లోకేశ్

Minister Nara Lokesh Inaugu

Minister Nara Lokesh Inaugu

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) కృష్ణా జిల్లా మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్కు(Mallavalli Industrial Park)లో అశోక్ లేలాండ్ ప్లాంట్‌(Ashok Leyland Plant)ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్లాంట్‌ను పరిశీలించిన ఆయన ప్రాంగణంలో మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు తమ కృషిని సూచించారు. ఈ ప్లాంట్ ద్వారా పరిశ్రమల అభివృద్ధి మాత్రమే కాకుండా, స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు అందుతాయని ఆయన పేర్కొన్నారు.

Congress 6 Guarantees : 6 గ్యారంటీలపై ఆశలు వదులుకునేలా బడ్జెట్ – కిషన్ రెడ్డి

మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. అశోక్ లేలాండ్ ప్లాంట్ ప్రారంభంతో మొదటి దశలో 600 మందికి, రెండో దశలో 1,200 మందికి ఉపాధి అవకాశాలు కలుగనున్నాయని తెలిపారు. ఈ పరిశ్రమ రాష్ట్రంలోని వాహన తయారీ రంగానికి కొత్త ఊపునిచ్చి, ఆర్థికాభివృద్ధికి దోహదం చేయనుందని అన్నారు.

మల్లవల్లిలో 75 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్‌లో బీఎస్-4 మోడల్ బస్సుల తయారీతో పాటు, ఎలక్ట్రిక్ వాహనాల బాడీ బిల్డింగ్ పనులు చేపట్టనున్నారు. ఈ ప్లాంట్ రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమల ప్రోత్సాహానికి ఒక నిదర్శనమని, భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ స్థాయి పరిశ్రమలను ఆంధ్రప్రదేశ్‌కు ఆకర్షించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని లోకేశ్ వెల్లడించారు.

Exit mobile version