భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI) కార్యదర్శి మరియు ఐసీసీ చైర్మన్ జై షా(Jay Shah ), తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) మధ్య ప్రత్యేకమైన స్నేహబంధం ఉంది. తాజాగా విశాఖపట్నంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ కోసం జై షా ప్రత్యేకంగా హాజరయ్యారు. సాధారణంగా ఐపీఎల్ మ్యాచ్‌లకు అంతగా వెళ్లని జై షా, ఈ మ్యాచ్ కోసం రావడం విశేషం. విశాఖలో మ్యాచ్ అనంతరం, నారా లోకేష్ మరియు జై షా కలిసి ఓ ప్రముఖ తెలుగు వంటకాలు అందించే హోటల్‌కి వెళ్లి డిన్నర్ చేశారు. ఈ సందర్భంగా ఇద్దరూ ఆప్త మిత్రుల్లా మాట్లాడుకుంటూ కనిపించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
MK Stalin : స్టాలిన్ పోస్ట్‌పై పలువురు కన్నడవాసులు ఆగ్రహం
నారా లోకేష్ – జై షా స్నేహబంధం గతంలో కూడా వార్తల్లో నిలిచింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో భారత్ – పాకిస్తాన్ మ్యాచ్‌కు లోకేష్ ప్రత్యేక ఆహ్వానం అందుకున్నారు. అప్పుడు వారిద్దరూ కలిసి మ్యాచ్‌ను వీక్షించారు. ఈ సందర్భంగా రాజకీయ వర్గాల్లో వారి సాన్నిహిత్యంపై చర్చ జరిగింది. ఇప్పుడు విశాఖలో మరోసారి ఈ బంధం హైలైట్ అవడం విశేషం. రెండు సందర్భాల్లోనూ జై షా – లోకేష్ సన్నిహితంగా మెలగడం వారి మధ్య సంబంధాన్ని మరింత బలంగా నిరూపిస్తోంది.
జై షా ప్రత్యక్ష రాజకీయాల్లో లేనప్పటికీ, క్రికెట్ పరంగా దేశవ్యాప్తంగా మేలుకోరే కీలక వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఆయన అధికారం వల్ల ఏపీలో ఓ కొత్త ఐపీఎల్ ఫ్రాంచైజీ తీసుకురావడం, అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియం నిర్మాణానికి మద్దతుగా నిలిచే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో లోకేష్ ఈ దిశగా కృషి చేస్తుండవచ్చని అంచనా వేస్తున్నారు. ఏపీలో క్రికెట్ అభివృద్ధి కోసం జై షా సహకారం అందించవచ్చనే వార్తలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.