మంత్రి నారా లోకేష్ (Nara Lokesh)..సోషల్ మీడియా లో నిత్యం యాక్టివ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే. ఎవరు ఏ ఆపదలో ఉన్న..ఎవరు సాయం అడిగిన తక్షణం స్పందిస్తూ వారిని ఆదుకుంటుంటారు. తాజాగా తన అభిమాని ఆత్మహత్య చేసుకోవడంపై ఎమోషనల్ అయ్యారు. ఆర్థిక, కుటుంబ సమస్యలతో శ్రీను (Srinu) అనే TDP అభిమాని ఆత్మహత్య చేసుకోవడంపై మంత్రి లోకేశ్ ఎమోషనల్ పోస్టు (Lokesh Emotional Post) చేశారు.
టీడీపీకి చెందిన డైహర్ట్ కార్యకర్త, శ్రీను ఆత్మహత్య చేసుకుని చనిపోవడం పట్ల టీడీపీ పార్టీకి చెందిన నేతలు.. తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. శ్రీను మరణ వార్త తెలిసి మంత్రి నారాలోకేష్ సైతం స్పందించారంటే.. ఆ అభిమానికి టీడీపీ అంటే.. ఎంత ఇష్టమో అర్థమైపొతుంది. శ్రీనుకి చిన్న ప్పటి నుంచి టీడీపీ అంటే ప్రాణాలు ఇచ్చేవాడంట.. అంతే కాకుండా.. టీడీపీ కార్యక్రమాలు.. నాయకులు ప్రొగ్రామ్ లకు తప్పకుండా హజరయ్యే వాడంట. మరీ ఏజరిగిందో కానీ.. శ్రీను ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీనిపై మంత్రి నారాలోకేష్ ఎక్స్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. తన పుట్టిన రోజు, పెళ్లి రోజు కార్యక్రమాల్ని.. శ్రీను పండగలా చేసేవాడని లోకేష్ చెప్పుకొచ్చారు. అలాంటి తనకు ఏంకష్టం వచ్చిందో.. ఒక్క మాట చెబితే.. వాటిని పరిష్కరించేవాడినని బాధపడ్డారు. ప్రతిసమస్యకు కూడా ఒక పరిష్కారం ఉంటుందని.. ఇలాంటి పనులు చేయకూడదు.. మనం బతికి . . మరికొందర్ని బతికించాలని కూడా నారా లోకేష్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం ఆ కుటుంబానికి మాత్రం.. తాము అన్ని విధాలుగా ఆదుకుంటామని కూడా నారా లోకేష్ అభయమించారు.
“అన్నా.. అన్నా… అని పిలిచేవాడివి. ఎవ్వరికీ ఏ కష్టం వచ్చినా సహాయం చేయాలని మెసేజ్ చేసే వాడివి. నా పుట్టినరోజు, పెళ్లి రోజులను పండగలా నిర్వహించేవాడివి. నీకు ఆపద వస్తే ఈ అన్నకి ఒక్క మెసేజ్ చేయాలని అనిపించలేదా?. దిద్దలేని చాలా పెద్ద తప్పు చేశావు తమ్ముడు. ఐ మిస్ యూ.
ఆత్మాభిమానం ఉండొచ్చు. కానీ ఆత్మహత్య చేసుకునేంతగా కాదు. నువ్వు బలవన్మరణానికి పాల్పడిన విచారకర సంఘటన సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న వెంటనే, నిన్ను బతికించుకునేందుకు చేయని ప్రయత్నం లేదు. సారీ శీను.. నీకున్న కష్టమేంటో నాకు ఎప్పుడూ చెప్పలేదు. నీకు కలిగిన నష్టమేంటో ఏ రోజూ నాకు తెలియనివ్వలేదు. నువ్వు లేవు.. కానీ నీ కుటుంబానికి నేనున్నా. నీ అన్నగా ఆ కుటుంబానికి అండగా ఉంటూ బాధ్యతల్ని నెరవేరుస్తా.
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నా అభిమానులు, సోషల్ మీడియా యాక్టివిస్టులకు ఇదే నా విన్నపం. అప్పులో, అనారోగ్యమో, ఆత్మాభిమానమో, కుటుంబ సమస్య ఏమైనా కానివ్వండి.. కుటుంబం, స్నేహితులు, బంధువులు, పార్టీలో హితులు వంటి వారితో షేర్ చేసుకోండి. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. బతికి ఉందాం.. మరికొందరిని బతికించుకుందాం.. దయచేసి ఇటువంటి తప్పుడు నిర్ణయాలు ఎవ్వరూ తీసుకోవద్దు” అంటూ భావోద్వేగ పోస్టు పెట్టారు. ‘ఎప్పుడూ అన్నా అని పిలిచేవాడివి. ఎవరికి ఏ కష్టం వచ్చినా సాయం చేయాలని మెసేజ్ చేసేవాడివి. నా బర్త్డే, పెళ్లి రోజులను పండుగలా జరిపేవాడివి. నీకు ఆపద వస్తే ఈ అన్నకు ఓ మెసేజ్ చేయాలనిపించలేదా? దిద్దలేని తప్పుచేశావ్ తమ్ముడు. ఓ అన్నగా మీ కుటుంబానికి అండగా ఉంటా’ అని రాసుకొచ్చారు.
అన్నా.. అన్నా… అని పిలిచేవాడివి. ఎవరికి ఏ కష్టం వచ్చినా సహాయం చేయాలని మెసేజ్ చేసేవాడివి. నా పుట్టినరోజు, పెళ్లి రోజులను ఓ పండగలా జరిపేవాడివి. నీకు ఆపద వస్తే ఈ అన్నకి ఒక్క మెసేజ్ చేయాలనిపించలేదా? దిద్దలేని చాలా పెద్ద తప్పు చేశావు తమ్ముడు. ఐ మిస్ యూ.
ఆత్మాభిమానం ఉండొచ్చు.… pic.twitter.com/gpGa54kqMw
— Lokesh Nara (@naralokesh) December 1, 2024
Read Also : South Africa- Australia: వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్.. ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మధ్య ఫైనల్ జరగనుందా?