Site icon HashtagU Telugu

Lokesh : ఒకేరోజు 105 అభివృద్ధి కార్యక్రమాలు..ఎమ్మెల్యేకి మంత్రి లోకేశ్ అభినందనలు

Minister Lokesh congratulates MLA for 105 development programs in one day

Minister Lokesh congratulates MLA for 105 development programs in one day

Lokesh : మంత్రి నారా లోకేష్ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఎక్స్ వేదిక గా అభినందించారు. కోటంరెడ్డి ఒకేరోజు 105 అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి రికార్డు సృష్టించారని అందులో పేర్కొన్నారు. దేశ, రాష్ట్ర చరిత్రలో ఇదొక అరుదైన ఘట్టం అన్నారు. తమ ప్రభుత్వం అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందనడానికి ఇది ఉదాహరణ అని లోకేష్ చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వంలో రోడ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడ్డారన్నారు. నెల్లూరు రూరల్‌లోని ప్రతి కాలనీలో రోడ్డు నిర్మాణం చేస్తున్నట్లు వివరించారు.

Read Also: Working Hours : పనిగంటలపై సౌమ్య స్వామినాథన్‌ కీలక వ్యాఖ్యలు

సీఎం చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి అంటే ఏంటో చూపించేందుకే రికార్డు స్థాయిలో పనులు చేపట్టినట్లు తెలిపారు. 60 రోజుల్లో పనులు పూర్తి చేస్తామని ప్రకటించారు. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఒకేసారి 105 పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో రూ.191 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నట్లు చెప్పారు. ఈ రోజు మొత్తం రూ.40 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు చేసినట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభివృద్ధి పనులకు స్థానికులతో శంకుస్థాపనలు చేయించారు. ఈ అభివృద్ధి కార్యాక్రమాల్లో భాగంగా వివిధ ప్రాంతాల్లో ఎమ్మెల్యే కోటంరెడ్డి బ్రదర్స్‌ , కూటమి నేతలు పాల్గోన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ..తరువాత వారం పాటు మరో 198 అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. 60 రోజుల్లో ఈ అభివృద్ధి పనులను పూర్తిచేసి, ప్రజలకు అంకితం చేస్తామన్నారు. ఈ గొప్ప అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబునాయుడికి, ప్రోత్సహిస్తున్న నారా లోకేష్‌ కు ధన్యవాదాలు తెలిపారు. వారు ఇచ్చే ఈ ప్రోత్సాహంతో భవిష్యత్ లో కూడా నెల్లూరు రూరల్ ప్రజల సమస్యల పరిష్కారం కోసం మరింత అంకిత భావంతో పని చేస్తానన్నారు.

Read Also: New Scheme : ఏపీలో కొత్త పథకం.. మొదలైన సర్వే