Site icon HashtagU Telugu

Durga Temple : ఇంద్ర‌కీలాద్రిపై మూలాన‌క్ష‌త్రం రోజున ప‌టిష్ట ఏర్పాట్లు.. రెండు ల‌క్ష‌ల‌కుపైగా భ‌క్తులు వ‌చ్చే ఛాన్స్‌

Durga Temple

Durga Temple

ఇంద్ర‌కీలాద్రిపై ద‌స‌ర ఉత్స‌వాలు అంగ‌రంగ వైభ‌వంగా కొన‌సాగుతున్నాయి. ఉత్స‌వాల్లో భాగంగా అమ్మ‌వారి జ‌న్మ‌న‌క్ష‌త్ర‌మైన మూల న‌క్ష‌త్రం రోజున అమ్మ‌వారిని ద‌ర్శించుకునేందుకు భ‌క్తులు పెద్ద సంఖ్య‌లో త‌ర‌లిరానున్నారు. ఈ నెల 20వ తేదీ (మూల న‌క్ష‌త్రం) శుక్రవారం అమ్మవారు స‌ర‌స్వ‌తీ దేవి అలంకారంలో భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు. ఆ రోజున అధిక సంఖ్య‌లో భ‌క్తులు అమ్మవారిని దర్శించుకునే అవ‌కాశ‌మున్నందున ఎక్క‌డా ఎటువంటి లోటుపాట్లకు తావు లేకుండా పటిష్ట ఏర్పాట్లు చేసిన‌ట్లు రాష్ట్ర దేవాదాయ‌, ధ‌ర్మాదాయ శాఖ మంత్రి కొట్టు స‌త్య‌నారాయ‌ణ తెలిపారు. భ‌క్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని క్యూలైన్లను ఏర్పాట్లు చేసిన‌ట్లు వెల్ల‌డించారు.

We’re now on WhatsApp. Click to Join.

ముందు జాగ్ర‌త్త‌గా ఆ రోజున ఎటువంటి వాహ‌నాల‌ను ఇంద్ర‌కీలాద్రిపైకి అనుమ‌తించ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలిపారు. అదే విధంగా వృద్ధులు, వికలాంగుల ప్ర‌త్యేక ద‌ర్శ‌న స్లాట్ల‌ను, కొండపైకి తీసుకొచ్చే వాహనాలను ర‌ద్దు చేసిన‌ట్లు, తెలిపారు. భ‌క్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించాల్సిందిగా విజ్ఞ‌ప్తి చేస్తున్నామ‌న్నారు. తొలిరోజు అధిక సంఖ్య‌లో భ‌క్తులు అమ్మ‌వారిని ద‌ర్శించుకున్న స‌మ‌యంలో గుర్తించిన చిన్న‌చిన్న లోటుపాట్లను స‌రిదిద్దామ‌ని.. దీంతో రెండో రోజు, మూడో రోజు కూడా భ‌క్తులు చాలా ప్ర‌శాంతంగా, ఆనందంగా అమ్మ‌వారిని ద‌ర్శించుకున్న‌ట్లు తెలిపారు. ఇంద్ర‌కీలాద్రిపై చేసిన ఏర్పాట్ల పట్ల భ‌క్తులు పూర్తిస్థాయిలో సంతృప్తి వ్య‌కం చేస్తున్న‌ట్లు మంత్రి కొట్టుస‌త్య‌నారాయ‌ణ పేర్కొన్నారు. భ‌క్తుల భద్రతయే త‌మ‌కు అత్యంత ముఖ్య‌మ‌ని వారి భ‌ద్ర‌త కోసం దేవ‌స్థానం యంత్రాంగం విడుద‌ల చేస్తున్న మార్గ‌ద‌ర్శ‌కాల‌ను తూచ‌ త‌ప్ప‌కుండా పాటించి అమ్మ‌వారి ఆశీస్సులు పొందాల‌ని అన్నారు.

Also Read:  Durga Temple : దేవాలయ ప్రాంగణంలో రాజకీయాలు మాట్లాడటం అనైతికం – దుర్గ‌గుడి ఛైర్మ‌న్ క‌ర్నాటి రాంబాబు