Site icon HashtagU Telugu

AP : వ్యవసాయాన్ని పండుగ చేసి రైతన్నలకు అండగా నిలబడింది జ‌గ‌నే – మంత్రి జోగి ర‌మేష్‌

Jogi Ramesh

వ్యవసాయాన్ని పండుగలా మార్చి రైతన్నలకు అన్ని రకాలుగా అండగా ఉన్న మనసున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ అని మంత్రి జోగి రమేష్ అన్నారు. వ్యవసాయం దండగ అని హేళన చేసిన గత తెలుగుదేశం పాలకులకు చెంపపెట్టుగా వ్య‌వ‌సాయ‌న్ని పండుగ చేశారన్నారు. వరుసగా ఐదో ఏడాది రెండో విడత దేశంలో ఎక్కడా లేనివిధంగా సొంత భూమి సాగు చేసుకుంటున్న రైతన్నలతో పాటు ఎస్సీ/ ఎస్టీ /బీసీ/ మైనార్టీ/ కౌలు రైతులు/ అటవీ, దేవాదాయ భూములు సాగు చేసుకుంటున్న రైతన్నలకు కూడా వైయస్సార్ రైతు భరోసా కింద ఏటా 13,500 రూపాయిలు రైతు భరోసా పథకం ద్వారా అందిస్తున్నామ‌న్నారు.
అపర భగీరధుడు, రైతు బాంధవుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి రైతాంగం సంక్షేమానికి ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొని వస్తే, నేడు వారి తనయుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రివి మించిన తనయుడుగా, తండ్రి ఒక అడుగు ముందుకు వేస్తే, నేడు సీఎం జగన్ పది అడుగులు ముందుకు వేస్తూ రైతులకు మేలు చేసే విధంగా ఎన్నో చారిత్రాత్మక పథకాలు పెట్టిన ఘనత పొందారని మంత్రి ప్రశంసించారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక పూర్తిగా వ్యవసాయ రంగం మీద ఆధారపడిన పెడన నియోజకవర్గం లోని రైతులకు వరుసగా ఐదో ఏడాది, రెండో విడత 13,500 రూపాయిలు రైతు భరోసా పథకం కింద ఈరోజు నేరుగా వారి బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ కావడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేస్తూ మండలాలు వారీగా లబ్ధిదారుల సంఖ్య మరియు వారు పొందిన లబ్ధి వివరాలు  వెల్లడించారు. బంటుమిల్లి మండలంలోని 5,326 మంది రైతులకు 2 కోట్ల 22 లక్షల 54 వేల 500 రూపాయిలు, గూడూరు మండలంలోని 8,739 మంది రైతులకు 3 కోట్ల 69 లక్షల 6 వేల రూపాయలు, కృత్తివెన్ను మండలంలోని 3,246 మంది రైతులకు ఒక కోటి 37 లక్షల 96 వేల 500 రూపాయిలు మరియు పెడన మండలంలోని 9,886 మంది రైతులకు 4 కోట్ల 11 లక్షల 55 వేల రూపాయిలు వెరసి మొత్తం 27,197 మంది రైతులకు ఈరోజు 11 కోట్ల 41 లక్షల 12 వేల రూపాయిల నగదు వారి బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరిగిందని మంత్రి జోగి రమేష్ వివరించారు.

Also Read:  Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఐఈడీ పేలుడులో సీఆర్పీఎఫ్ జవాన్ కు తీవ్ర గాయాలు