ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ వైసీపీ (YCP) కి వరుస పెట్టి నేతలు షాక్ ఇస్తున్నారు. ముఖ్యంగా సర్వేల ఆధారంగా నియోజక ఇంచార్జ్ లను మార్చడం , టికెట్లు కూడా ఇవ్వకపోవడం , కొన్ని చోట్ల నేతలను మారుస్తూ నిర్ణయాలు తీసుకోవడం వైసీపీ కి మైనస్ గా మారబోతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటికే జగన్ తీసుకున్న ఈ నిర్ణయాలతో చాలామంది పార్టీ కి గుడ్ బై చెప్పి బయటకు వచ్చేయగా..మరికొంతమంది కూడా ఇదే బాటలో నడుస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
తాజాగా ఆలూరు ఎమ్మెల్యే, మంత్రి గుమ్మనూరు జయరాం (Minister Gummanur Jayaram ) వైసీపీని వీడటం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన టీడీపీ నేతలతో మంతనాలు జరిపినట్లు సమాచారం. ఆలూరు ఇన్ఛార్జ్ గా విరూపాక్షను వైసీపీ అధిష్టానం నియమించింది. జయరాంను కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా ప్రకటించడం పట్ల ఆయన అసంతృప్తిగా ఉన్నారు. అప్పటి నుండి వైసీపీ నిర్వహించిన పలు కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అయితే పార్టీ అధిష్టానం ఆయన్ను ఒప్పించేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం రాలేదు. ఇక జయరాం కు అనంతపూర్ జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి టిడిపి టికెట్ దాదాపు ఖరారు అయినట్టే అంటూ నియోజకవర్గం మొత్తం చర్చ నడుస్తోంది. జయరాం సైతం రహస్యంగా ఆలూరు నియోజకవర్గంలోని ముఖ్య నేతలను పిలిపించుకొని సమావేశమయినట్లు సమాచారం. ఈ సమావేశంలో ఆయన భవిష్యత్తు కార్య చరణ పై చర్చించి ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు ఈ నెల 22 లేదా 23 తేదీల్లో చంద్రబాబు సమక్షంలో సైకిల్ ఎక్కబోతున్నట్లు తెలుస్తుంది.
ఇటు రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (Vemireddy Prabhakar Reddy) వైసీపీకి గుడ్ బై చెప్పారు. వైసీపీ సభ్యత్వానికి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తూ అధిష్టానానికి లేఖ రాసారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. టీటీడీ బోర్డు సభ్యురాలిగా ఉన్న ప్రభాకర్ రెడ్డి భార్య ప్రశాంతి కూడా వైసీపీకి గుడ్ బై చెప్పారు. వీరిద్దరూ టీడీపీలో చేరబోతున్నట్లు సమాచారం. ఇక ఎన్నికల సమయానికి వైసీపీ సగం వరకు ఖాళీ కావడం ఖాయమని బయటకు వచ్చిన నేతలు అంటున్నారు.
Read Also : Kamal Haasan : ఇండియా కూటమిలో చేరికపై స్పందించిన కమల్ హాసన్