Gummanur Jayaram : కాంగ్రెస్ గూటికి వైసీపీ మంత్రి గుమ్మనూరు జయరాం..?

  • Written By:
  • Updated On - January 22, 2024 / 07:54 PM IST

ఏపీలో అధికార పార్టీ వైసీపీ (YCP) అధిష్టానం తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు పార్టీ లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా సర్వేల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల ఫై వ్యతిరేకత ఉందని చెప్పి..వారికీ కాకుండా కొత్తవారికి టికెట్స్ ఇవ్వడం..పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చడం..అలాగే ఎమ్మెల్యేల టికెట్ ఆశించిన వారికీ ఎంపీ టికెట్స్ ఇస్తుండడం తో..చాలామంది నేతలు అధిష్టాన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ..పార్టీకి రాజీనామా చేస్తున్నారు. ఇప్పటికే పలువురు రాజీనామా చేసి టీడీపీ (TDP) , జనసేన (Janasena) పార్టీలలో చేరగా..తాజాగా గుమ్మనూరు జయరాం ((Minister Gummanur Jayaram)) సైతం పార్టీ కి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దమయ్యాడనే వార్తలు వినిపిస్తున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా వైస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడురాలుగా బాధ్యత చేపట్టిన సంగతి తెలిసిందే. షర్మిల ( YS Sharmila ) ఏపీలో అడుగుపెట్టిందో లేదో పలువురు నేతలు కాంగ్రెస్ లో చేరారు..అలాగే తన మొదటి స్పీచ్ తోనే అందర్నీ ఆకట్టుకుంది. గతంలో కాంగ్రెస్ లో పనిచేసిన నేతలతో పాటు వైస్ అభిమానులైన నేతలు సైతం షర్మిల వెంట నడవాలని చూస్తున్నారు.ఇదే తరుణంలో గుమ్మనూరు జయరాం..సైతం ఆళ్ల బాటలోనే నడిచేందుకు సిద్ధం అవుతున్నారని తెలుస్తుంది.

ఇప్పటికే జయరాం..కర్ణాటక కాంగ్రెస్ నేతలతో టచ్ లోకి వెళ్లాడట. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (Deputy CM DK Shivakumar), మంత్రి నాగేంద్రతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కర్నూలు జిల్లా బాధ్యతలు ఇచ్చే యోచనలో కాంగ్రెస్ ఉంది. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో జయరాం ఐదు సీట్లు అడుగుతున్నారట. వాల్మీకి సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలపై దృష్టి సారించారు. కర్నూలు జిల్లాలో ఆలూరు, ఆదోని, మంత్రాలయం, పత్తికొండ.. అనంతపురం జిల్లాలో గుంతకల్లు, ఉరవకొండ, రాయదుర్గం ఫోకస్ పెట్టారు. రాయలసీమ జిల్లాల్లో వాల్మీకి సామాజిక వర్గం ఎక్కువగా ఉండడంతో జయరాంను ఉపయోగించుకుంటే పార్టీకి బలం చేకూరుతుందని అంచనా వేస్తున్నారు కాంగ్రెస్ అధిష్టానం. దీనిపై త్వరలోనే ఓ ప్రకటన రానుందని వినికిడి.

Read Also : MLC : ఎన్నికలు లేకుండానే ఎమ్మెల్సీలుగా మహేష్‌ , బల్మూరి వెంకట్‌ ఏకగ్రీవం