Site icon HashtagU Telugu

Chandrababu Health : సింపతీ కోసమే చంద్రబాబు అస్వస్థత అంటున్నాడు – మంత్రి గుడివాడ అమర్నాథ్

Minister Gudivada Amarnath

Minister Gudivada Amarnath

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఆరోపణలు ఎదురుకుంటున్న మాజీ సీఎం , టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu)..గత నెల రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్ లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈయనను బయటకు తీసుకొచ్చేందుకు లాయర్లు ట్రై చేస్తూనే ఉన్నప్పటికీ..ఈ కేసు తో పాటు పలు కేసులు బాబు ఫై నమోదు చేయడం తో బెయిల్ రావడానికి ఆలస్యం అవుతుంది. ఈ క్రమంలో గత వారం రోజులుగా విపరీతమైన ఎండ కారణంగా చంద్రబాబు అస్వస్థత (Chandrababu Health Condition)కు గురయ్యారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో చంద్రబాబు డీ హైడ్రేషన్ కు గురయ్యారు..ఈ విషయాన్నీ జైలు అధికారులకు తెలియజేయడం జరిగింది. అలాగే ఇదే విషయాన్నీ నిన్న ములాఖత్ అయినా కుటుంబ సభ్యులకు బాబు చెప్పడం జరిగింది.

We’re now on WhatsApp. Click to Join.

కాగా చంద్రబాబు అస్వస్థత ఫై మంత్రి గుడివాడ అమర్నాథ్ (Minister Gudivada Amarnath) స్పందించారు. చంద్రబాబు అస్వస్థతకు గురైనట్టు చెప్పి సింపతీ కోసం ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు ఉంటుంది వెల్నెస్ సెంటర్లో కాదు సెంట్రల్ జైల్లో అన్న విషయం గుర్తుపెట్టుకోండి అని గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. నేరం చేసిన వాళ్ళని ఉంచడానికి జైళ్ళు ఉన్నాయని పేర్కొన్న గుడివాడ అమర్నాథ్ డీహైడ్రేషన్ అయినా, దోమలు కుట్టిన జైల్లో అన్ని రకాల సేవలు అందుబాటులో ఉంటాయని కౌంటర్ ఇచ్చారు. అలాగే లోకేష్ ఫై కూడా అమర్నాద్ పౌ సైటైర్లు వేశారు.

CID విచారణ తర్వాత మీడియా తో లోకేష్ మాట్లాడిన వ్యాఖ్యలపై అమర్నాద్ స్పందిస్తూ.. లోకేష్ సెల్ఫ్ సర్టిఫైడ్ మేధావిలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. దొంగతనం చేసిన వాళ్ళు ఒకసారితో నిజం చెప్పరని ఆయన పేర్కొన్నారు. సిఐడి వేసే ప్రశ్నలు అమరావతి భూముల స్కాముల చుట్టూనే ఉంటాయి కానీ, లోకేష్ కుటుంబం యోగక్షేమాల గురించి కాదు అంటూ సెటైర్లు వేశారు. హెరిటేజ్ ను ఏర్పాటు చేయడం కోసం అమరావతిలో 14 ఎకరాలు కొనుగోలు చేయనప్పుడు లోకేష్ ఎందుకు సంతకం పెట్టాడో చెప్పాలని అమర్నాథ్ డిమాండ్ చేశారు. లోకేష్ ఏదో చెప్పినంత మాత్రాన, మేధావిలా బిల్డప్ ఇచ్చినంత మాత్రాన చేసిన తప్పు నుంచి తప్పించుకోలేరని, లోకేష్ చేసిన తప్పుకు శిక్ష పడటం ఖాయమని అమర్నాథ్ అన్నారు.

Read Also : Makineedi Seshu Kumari : జనసేన పార్టీ కి భారీ షాక్..కీలక నేత రాజీనామా