Bosta : పవన్ కల్యాణ్ తో గోరంత ఉపయోగం లేదు…!!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖలోని రుషికొండలను పరిశీలించడంపై మంత్రి బొత్స సత్యనారాయణ తనదైన శైలిలో స్పందించారు. పవన్ వల్ల గోరంత ఉపయోగం లేదన్నారు. రుషికొండలో ప్రభుత్వ భవనాలు నిర్మిస్తున్నామని…గతంలోనూ అక్కడ భవనాలు ఉన్న విషయాన్ని గుర్తు చేశారు బొత్స. ఇక విజయనగరం జిల్లాలో రాష్ట్రంలోనే అతిపెద్ద టౌన్ షిప్ లో జగనన్న కాలనీ నిర్మిస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడిన డిప్యూటీ స్పీకర్ కొలగట్ల వీరభద్రస్వామి….గుంకలాంకు పవన్ కల్యాణ్ ను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. […]

Published By: HashtagU Telugu Desk
Pawan Botsa

Pawan Botsa

జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖలోని రుషికొండలను పరిశీలించడంపై మంత్రి బొత్స సత్యనారాయణ తనదైన శైలిలో స్పందించారు. పవన్ వల్ల గోరంత ఉపయోగం లేదన్నారు. రుషికొండలో ప్రభుత్వ భవనాలు నిర్మిస్తున్నామని…గతంలోనూ అక్కడ భవనాలు ఉన్న విషయాన్ని గుర్తు చేశారు బొత్స. ఇక విజయనగరం జిల్లాలో రాష్ట్రంలోనే అతిపెద్ద టౌన్ షిప్ లో జగనన్న కాలనీ నిర్మిస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడిన డిప్యూటీ స్పీకర్ కొలగట్ల వీరభద్రస్వామి….గుంకలాంకు పవన్ కల్యాణ్ ను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. 12వేల మందికి పైగా లబ్దిదారులకు లే అవుట్స్ వేశామని…5లక్షల విలువైన భూమితోపాటు ఇంటికి లక్షన్నర నగదు ఇస్తున్నట్లు తెలిపారు.

ఇక మంత్రి గుడివార అమర్ నాథ్…పవన్ పై సెటైర్లు వేశారు. జనసేన పార్టీయే కాదని..సినిమా పార్టీ అంటూ విమర్శించారు. జనసేనను నాదేండ్ల మనోహర్ నిండా ముంచడం ఖాయమన్నారు. టీడీపీతోనే జనసేకు పొత్తు అని మిగిలినవన్నీ స్టెప్నీలే అంటూ సెటైర్లు వేశారు. మోదీ సభను డైవర్ట్ చేసేందుకు పవన్ రుషికొండలకు వెళ్లినట్లు ఆరోపించారు. అంతకు ముందు పవన్ కల్యాణ్ రుషికొండను పరిశీలించిన సంగతి తెలిసిందే.

  Last Updated: 12 Nov 2022, 08:46 PM IST