Site icon HashtagU Telugu

Kapu Meet:కాపుల సమావేశం కాదు.. కాఫీ సమావేశమే.. !

Botsa Satyanarayana

Botsa Satyanarayana

ఇటీవ‌ల హైద‌రాబాద్ లో ఏపీ కాపు నేత‌ల భేటి పై ప‌లు ఊహాగానాలు వ‌చ్చాయి. కాపులంతా ఏక‌మై కొత్త పార్టీ పెడుతున్నార‌ని కొంద‌రు… జ‌న‌సేన‌కి మ‌ద్ద‌తు ఇచ్చే అంశంపై చ‌ర్చ జ‌రిగింద‌ని మ‌రికొంద‌రి చ‌ర్చించుకున్నారు. అయితే కాపుల భేటీపై మంత్రి బొత్స స‌త్యనారాయ‌ణ స్పందించారు. అది కాపుల స‌మావేశం కాద‌ని..కాఫీ స‌మావేశం అంటూ వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో ఒక వివాహ కార్యక్రమానికి అందరం వెళ్లామ‌ని.. సాయంత్రం రిసెప్షన్‌కు రావాలని ఫోన్‌ వచ్చిందని తెలిపారు. అయితే అక్కడకు వెళ్లే ముందు అందరం కూర్చుని కాఫీ తాగి వెళదామని త‌న‌కు ఫోన్‌ వచ్చిందపి.. దాన్నే చిలువలు, పలువలు చేసి మీడియాలో రాసుకుంటున్నారని మంత్రి బొత్స స‌త్యనారాయ‌ణ అన్నారు. అది ఫ్రెండ్స్‌ మీటింగ్‌ మాత్రమేన‌ని.. దాన్నే కొందరు తమకు కావాల్సినట్టుగా ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. అది కాకుండా ఇంకేదైనా మీటింగ్ జరిగి ఉంటే త‌న‌కు తెలియదని.. తెలియనదాని గురించి మాట్లాడం అనేది తప్పు అంటూ స‌మాధానం ఇచ్చారు.