dsc-notification : ఇటీవల ఏపీ క్యాబినెట్ టీచర్ పోస్టుల నియామకాలకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం నేడు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 6,100 టీచర్ పోస్టుల భర్తీ కోసం నేడు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నోటిఫికేషన్ విడుదల చేశారు.
టీచర్ పోస్టుల వివరాలు…
.మొత్తం పోస్టులు: 6,100
.ఎస్జీటీల సంఖ్య: 2,280
.స్కూల్ అసిస్టెంట్లు: 2,299
.టీజీటీలు: 1,264
.పీజీటీలు: 215
.ప్రిన్సిపాల్స్: 42
ముఖ్యమైన తేదీలు…
.ఫిబ్రవరి 12 నుంచి ఫిబ్రవరి 21 వరకు ఫీజు చెల్లింపు గడువు
.ఫిబ్రవరి 22 వరకు దరఖాస్తుల స్వీకరణ
.మార్చి 5 నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడింగ్ కు అవకాశం
.మార్చి 15 నుంచి మార్చి 30 వరకు ఆన్ లైన్ విధానంలో పరీక్షలు
.ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తొలి సెషన్
.మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్
<span style=”color: #ff0000;”><strong>We’re now on WhatsApp</strong></span>. <a href=”https://whatsapp.com/channel/0029Va94sppFy72LQLpLhB0t”><strong>Click to Join.</strong></a>
ఇతర వివరాలు…
.2018 సిలబస్ ప్రకారమే డీఎస్సీ పరీక్షల నిర్వహణ
.జనరల్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితి 44 సంవత్సరాలు
.రిజర్వ్ డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితి మరో ఐదేళ్లు పెంపు
.పూర్తి వివరాలకు cse.apgov.in వెబ్ సైట్ ను సందర్శించారు.
read also : Ys Sharmila : నోరు అదుపులో పెట్టుకోవాలంటూ రోజా కు షర్మిల వార్నింగ్..