Site icon HashtagU Telugu

Botsa : పవన్ ను చూస్తే రక్తం మరుగుతోంది..!!

Botsa Satyanarayana Ap Electricity Charges Hike

Botsa Satyanarayana Ap Electricity Charges Hike

జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. జనసేన అనేది ఓ రాజకీయ పార్టీనే కాదు. అదో సెలబ్రేటీ పార్టీ. రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజం. కానీ పవర్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు హద్దులు మీరాయని ఆగ్రహం వ్యక్తం చేసారు బొత్స. మంత్రులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవల్సిందే కదా అన్నారు. విశాఖలో పవన్ సభ రద్దు చేసుకున్నారు. ర్యాలీగా వెళ్లకుండా సభ నిర్వహించుకోవాలని పోలీసులు చెప్పారని బొత్స వెల్లించారు. పవన్ మాటలు వింటుంటే రక్తం మరిగిపోతోంది. మాకు సంస్కారం ఉందని కాబట్టి మౌనంగా ఉన్నాం. చిరంజీవి రాజకీయాల్లో వచ్చినప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడలేదంటు గుర్తుచేశారు. అమరావతి యాత్రను టీడీపీ నడిపిస్తోందన్న బొత్స…పాదయాత్ర చేస్తున్నవారంతా రియల్ ఎస్టేట్ వ్యాపారులే అన్నారు.

ఇది కూడా చదవండి : గతి తప్పిన పవన్ భాష! చెప్పుతో కొడతా ! నరికి చంపేస్తా!

కాగా అంతకు ముందు బుధవారం పవన్ కల్యాణ్ వైసీపీ నేతలపై వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పవన్ వ్యాఖ్యలకు కౌంటర్ గా బొత్స ఈ వ్యాఖ్యలు చేశారు.