Pawan Kalyan : చేగువేరా పేరుతో పవన్ కాకమ్మ కబుర్లు – అంబటి

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫై వైసీపీ మంత్రి అంబటి రాంబాబు (Minister Ambati Rambabu) మరోసారి విరుచుకపడ్డారు. నిన్న భీమవరం లో పార్టీ నేతలతో పవన్ మాట్లాడిన తీరుపై రాంబాబు అసహనం వ్యక్తం చేసారు. We’re now on WhatsApp. Click to Join. ” జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనేది ఈ రోజుల్లో కుదరని పని. జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేస్తామని నేను అన్నట్లు చెప్తున్నారు. కానీ ఎప్పుడూ నేను అలా […]

Published By: HashtagU Telugu Desk
Ambati Pawan

Ambati Pawan

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫై వైసీపీ మంత్రి అంబటి రాంబాబు (Minister Ambati Rambabu) మరోసారి విరుచుకపడ్డారు. నిన్న భీమవరం లో పార్టీ నేతలతో పవన్ మాట్లాడిన తీరుపై రాంబాబు అసహనం వ్యక్తం చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

” జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనేది ఈ రోజుల్లో కుదరని పని. జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేస్తామని నేను అన్నట్లు చెప్తున్నారు. కానీ ఎప్పుడూ నేను అలా అనలేదు. ఎన్నికల ఖర్చును ఎన్నికల సంఘం కూడా 45 లక్షలకు పెంచింది. డబ్బులు ఖర్చుచేయకుండా రాజకీయాలు చేద్దామంటే ఈ రోజుల్లో కుదరని పని. కనీసం భోజనాలైనా పెట్టుకుండా పాలిటిక్స్ చేద్దామంటే అవదు. నా కోసం అభిమానులు వస్తారు. అందుకే డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిందేనని నాయకులకు అందరికీ ముందే చెప్పా. ఇక ఓట్లు కొనాలా వద్దా అనేది మీ నిర్ణయం. కనీసం 2029 తర్వాతైనా డబ్బులతో ఓట్లు కొనని రాజకీయం రావాలి. అప్పుడు నిజమైన డెవలప్ మెంట్ జరుగుతుంది..’ అని , టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు కోసం చాలా కష్టపడినట్లు పవన్ పేర్కొన్నారు. ‘జాతీయ నాయకత్వంతో ఎన్ని చీవాట్లు తిన్నానో నాకే తెలుసు. వాళ్లను ఒప్పించడానికి నానా మాటలు పడ్డాను. రెండు చేతులు జోడించి, దండం పెట్టి అడిగాను. నేనెప్పుడూ నా కోసం అడగలేదు. రాష్ట్ర భవిష్యత్తు కోసం అడిగాను.. తిట్టినా భరించాను’ అని పవన్ చెప్పుకొచ్చారు.

ఈ వ్యాఖ్యలపై మంత్రి అంబటి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రజాస్వామ్యంపై నమ్మకమున్న ప్రతి వ్యక్తితోనూ ఆయన చీవాట్లు తినాల్సిందేనన్నారు. ‘బిజెపి తో పొత్తులో ఉండి మరో పార్టీతో వెళ్లిన పవన్ లాంటి అనైతిక రాజకీయ నేత ఎక్కడా ఉండరు. చేగువేరా పేరుతో కాకమ్మ కబుర్లు చెప్పి.. ఇప్పుడు ఓట్లు కొనుక్కోమంటూ నేతలకు లైసెన్స్ ఇచ్చారు’ అని అంబటి మండిపడ్డారు.

Read Also : LS Elections : మహబూబ్‌నగర్‌ అభ్యర్థుల్లో ఉత్కంఠ

  Last Updated: 22 Feb 2024, 01:51 PM IST