Ambati Rambabu Dance Video: స్టెప్పులతో అదరకొట్టిన మంత్రి అంబటి రాంబాబు.. వీడియో వైరల్..!

ఏపీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి తన స్టెప్పులతో (Ambati Rambabu Dance Video) సందడి చేసారు. తెలుగు రాష్ట్రాల్లో భోగి వేడుకలు మొదలయ్యాయి. ఉదయం నుంచే పలువురు భోగి మంటలతో సంబరాలు చేసుకుంటున్నారు.

Published By: HashtagU Telugu Desk
Ambati Rambabu Dance Video

Safeimagekit Resized Img (4) 11zon

Ambati Rambabu Dance Video: ఏపీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి తన స్టెప్పులతో (Ambati Rambabu Dance Video) సందడి చేసారు. తెలుగు రాష్ట్రాల్లో భోగి వేడుకలు మొదలయ్యాయి. ఉదయం నుంచే పలువురు భోగి మంటలతో సంబరాలు చేసుకుంటున్నారు. ప్రముఖులు భోగి శుభాకాంక్షలు చెబుతున్నారు. మంత్రి అంబటి రాంబాబు స్థానికులతో కలిసి భోగి వేడుకల్లో పాల్గొన్నారు. స్టెప్పులతో అదరగొట్టారు. గత ఏడాది సత్తెనపల్లిలో అంబటి రాంబాబు సంక్రాంతి వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

నేడు భోగి పండుగ సందర్భంగా మంత్రి అంబటి రాంబాబు స్టెప్పులేశారు. సత్తెనపల్లి గాంధీచౌక్ సెంటర్లో నిర్వహించిన భోగి మంటల వేడుకల్లో అంబటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భోగి మంటలు వెలిగించి, డ్యాన్స్ చేశారు. అంబటితో పాటు స్థానిక నేతలు కూడా స్టెప్పులేసి అలరించారు. ఇప్పుడు భోగి సంబరాల్లో మంత్రి అంబటి స్థానికులతో కలిసి పండుగ జరుపుకుంటున్నారు. బంజారా డాన్స్ చేసారు. స్టెప్పులతో హోరెత్తించారు. మంత్రి స్టెప్పులు వేస్తున్న సమయంలో యువత కేరింతలు కొడుతూ మద్దతు పలికారు. డప్పు కళాకారులు బంజారాలతో కలిసి భోగి మంటల చుట్టూ పాటలు పాడుతూ.. డాన్స్ లు చేస్తూ పండుగను ఆస్వాదించారు. మంత్రితో పాటు పలువురు డాన్స్ చేశారు.

Also Read: Dhruv Jurel Story: క్రికెట్ వద్దన్న తండ్రి.. గోల్డ్​ చైన్ అమ్మి క్రికెట్ కిట్ కొనిచ్చిన తల్లి.. ఇదే ధృవ్ జురెల్ రియల్ స్టోరీ..!

ఈ సందర్భంగా ‘మీరు సంబురాల రాంబాబు అని ప్రతిపక్షాలు కామెంట్ చేస్తున్నాయి.. అందుకు మీరేమంటారు’ అని అడగ్గా.. ‘‘అవును నేను సంబురాల రాంబాబునే, నాకు ఇష్టమొచ్చినట్లుగా నేనుంటా, ప్రజలతో ఆనందంగా జరుపుకోవడం సంతోషంగా ఉంది. నా అనుకరణలను సినిమాల్లో పెట్టడం సంతోషకరవిషయమే’ అని పేర్కొన్నారు. ఈ సాంగ్ లో పవన్ వాయిస్ ను ఉపయోగించారు అంబటి అభిమానులు. ప్రస్తుతం అంబటి రాంబాబు డాన్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోపై పలువురు అభిమానులు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

భోగి వేడుకల్లో చంద్రబాబు, పవన్

AP రాజధాని అమరావతి ప్రాంతంలోని మందడం గ్రామంలో నిర్వహించిన భోగి వేడుకల్లో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ‘తెలుగు జాతికి స్వర్ణ యుగం-సంక్రాంతి సంకల్పం’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాల కాపీలను భోగి మంటల్లో వేసి నిరసన వ్యక్తం చేశారు.

 

  Last Updated: 14 Jan 2024, 09:19 AM IST