విశాఖ వాసులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దసరా కానుకగా అందించనున్నట్లు ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తెలిపారు. విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడిగా వైఎస్సార్‌సీపీ నేత కోలా గురువులు బుధవారం పార్టీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన కార్యక్రమంలో ఐటీశాఖ మంత్రి అమర్‌నాథ్ పాల్గొన్నారు. దసరా సందర్భంగా వైజాగ్ వాసులకు ముఖ్యమంత్రి శుభవార్త చెబుతారని, దానిని అన్ని వర్గాలు స్వాగతిస్తాయన్నారు. పార్టీని నమ్ముకుని పార్టీ కోసం కష్టపడే వారికి గుర్తింపు, ప్రతిఫలం లభిస్తాయని మంత్రి అమర్‌నాథ్ తెలిపారు. కోల గురువులకు జిల్లా అధ్యక్ష, జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్ వంటి ముఖ్యమైన పదవులు ఇచ్చామని ఉత్తరాంధ్ర సమన్వయ కర్త వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. పార్టీ క్యాడర్ ను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్ సీపీని గెలిపించాలని కోరారు. సార్వత్రిక ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో పార్టీ గెలుపునకు కృషి చేస్తానని, ఎలాంటి లోటుపాట్లు లేకుండా పార్టీ ఆశయాలను నెరవేర్చేందుకు కృషి చేస్తానని జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు తెలిపారు.
Andhra Pradesh : దసరా నాటికి వైజాగ్ వాసుల కలలు నెరవేరుతాయి – మంత్రి అమర్‌నాథ్

Minister Amarnath Reaction On Telangana Bid Filing..