Site icon HashtagU Telugu

Mid term poll :`ముంద‌స్తు`దిశ‌గా జ‌గ‌న్ రాజ‌కీయ రివ్యూలు

Jagan Highlights

Election Quarter Uttarandhra, Jagan's Graph Is Dull There

జిల్లాల వారీగా రాజ‌కీయ రివ్యూ మీటింగ్ లు పెడుతోన్న ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు(Mid term poll) ప్లాన్ చేసుకుంటున్నార‌ని బ‌లంగా టాక్ ఉంది. ఆయ‌న సంక్షేమ ప‌థ‌కాల మీద మ‌రో ఛాన్స్ ను న‌మ్ముకున్నారు. మ‌రో నెల‌ల పాటు ఆర్థిక ఇబ్బంది లేకుండా కేంద్రం సుమారు రూ. 10వేల కోట్ల‌ను రెవెన్యూ లోటు కింద విడుద‌ల చేసింది. బాండ్ల రూపంలో మ‌రో రూ. 2వేల కోట్ల‌ను ఏపీ స‌ర్కార్ రాబ‌ట్టింది. ఈ మొత్తం మ‌రో ఆరు నెల‌ల వ‌ర‌కు సంక్షేమ ప‌థ‌కాల‌ను స‌వ్యంగా సాగించ‌డానికి అవ‌కాశం ఉంది. ఆ త‌రువాత ఆర్థిక ఇబ్బందులు వ‌స్తే బట‌న్ నొక్కుడు(Jaganmohan Reddy) క‌ష్ట‌మ‌వుతోంది. అందుకే, ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని భావిస్తున్న‌ట్టు తాడేప‌ల్లి వ‌ర్గాల్లోని వినికిడి.

జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు ప్లాన్(Mid term poll) 

ప్ర‌భుత్వ వ్య‌తిరేకత స‌హ‌జంగా పెరుగుతూ వ‌స్తోంది. ఆ విష‌యాన్ని ఇటీవ‌ల చేసిన స‌ర్వేల ఆధారంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jaganmohan Reddy) గ్ర‌హించార‌ట‌. తాజాగా జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో అధికార వైసీపీ అప‌జ‌యాన్ని మూట‌గ‌ట్టుకుంది. ఫ‌లితంగా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం జోష్ మీద ఉంది. మ‌హానాడుకు హాజ‌రైన జ‌నం, అక్క‌డ వ‌చ్చిన స్పంద‌న గ‌మ‌నించిన ఏపీ స‌ర్కార్ ముంద‌స్తు (Mid term poll)దిశ‌గా అడుగులు వేస్తుంద‌ని తెలుస్తోంది. ఆ మేర‌కు నిఘా వ‌ర్గాలు కూడా ఫీడ్ బ్యాక్ ఇచ్చాయ‌ని స‌మాచారం. ఇప్ప‌టి వ‌ర‌కు పొత్తులు అంశంపై క్లారిటీ రాలేదు. జ‌న‌సేనాని ప‌వ‌న్ ఇంకా ప‌బ్లిక్ లోకి దూక‌లేదు. యువ‌గ‌ళం పూర్తిగా చేయ‌డానికి టైమ్ ప‌డుతుంది. వాటిన్నింటినీ అర్థాంత‌రంగా ఆగిపోయేలా చేసే ముంద‌స్తు అస్త్రం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తీస్తున్నార‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.

అక్టోబర్‌లో షెడ్యూల్‌ కంటే ఆరు నెలల ముందే అసెంబ్లీని రద్దు  

అక్టోబర్‌లో షెడ్యూల్‌ కంటే ఆరు నెలల ముందే (Mid term poll)అసెంబ్లీని రద్దు చేసి మధ్యంతర ఎన్నికలకు వెళ్లాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచిస్తున్న‌ట్టు న్యూస్ వైర‌ల్ అవుతోంది. అందుకు సంబంధించిన చ‌ర్చ‌ల‌ను ఇటీవలి ఢిల్లీ పర్యటనల్లో బీజేపీ పెద్ద‌ల‌తో జ‌రిపిన‌ట్టు తెలుస్తోంది. ఎన్‌డిఎ ప్రభుత్వంతో జగన్ సత్సంబంధాలను క‌లిగి ఉన్నారు. ఫలితంగా చంద్రబాబు నాయుడు (Chandrababu)హయాం నుండి పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ లోటును పూడ్చేందుకు ఇటీవల రూ.10,000 కోట్లకు పైగా విడుదల సాధ్య‌మ‌యింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం ఎదుర్కొంటున్న తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి సరైన సమయంలో కేంద్రం సానుకూలంగా స్పందించింది. ప్రస్తుత సంక్షోభాన్ని మరో ఆరు నెలల పాటు ఎదుర్కోవటానికి ఈ నిధులు జ‌గ‌న్ స‌ర్కార్ కు స‌రిపోతాయ‌ని అంచ‌నా.

Also Read : Jagan Ruling : CBN 6 వ‌జ్రాలు, జ‌గ‌న్ మ‌ర‌చిన‌ 130 హామీలు

రెండు నెలల క్రితం శాసన మండలికి జరిగిన గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఎన్నికలు టీడీపీకి ఎన‌లేని ఉత్సాహాన్ని ఇచ్చాయి. రాష్ట్రంలోని జిల్లా పరిషత్‌లు, స్థానిక సంస్థలు మరియు ఉపఎన్నికలు ఇలా ప్రతి ఎన్నికలలో టీడీపీ ఓడిపోయింది. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ఫలితాల‌ను గ‌మ‌నించిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మధ్యంతర ఎన్నికలను (Mid term poll)ఎంచుకోవడానికి పురికొల్పుతోంది. అసెంబ్లీలో విప‌క్షం పోరుకు సిద్ధం కావడానికి ముందే సమస్యను అధిగ‌మించాల‌ని వైసీపీ అడుగులు వేస్తోంది.

Also Read : TDP Manifesto: చంద్రబాబు ఎన్నికల శంఖారావం! తొలి మేనిఫెస్టో ఇదే