Men Turn Women : ఆ గ్రామంలో హోలీ వచ్చిందంటే చాలు..మగవారు..మహిళలుగా మారతారు..

హోలీ పండుగ రోజు పురుషులు స్త్రీల వేషంలో మన్మథస్వామిని దర్శించుకుంటే శుభం జరుగుతుందని, కోరికలు నెరవేరతాయన్నది ఇక్కడి గ్రామస్థుల నమ్మకం

Published By: HashtagU Telugu Desk
Holi In Santhekudluru

Holi In Santhekudluru

మాములుగా హోలీ (Holi) పండగ వచ్చిందంటే ప్రతి ఒక్కరు రంగులు పూసుకుంటూ..ఎంతో సంతోషంగా జారుకుంటుంటారు. నిన్న దేశ వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు హోలీ వేడుకలను ఎంతో సంబరంగా జరుపుకున్నారు. సినీ తారలు , రాజకీయ నేతలు ఇలా ప్రతి ఒక్కరు కూడా వారి వారి కుటుంబ సభ్యులతో హోలీని జరుపుకోగా..కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతేకుళ్ళురు (Santhekudulur ) గ్రామంలో మాత్రం హొలీ పండుగ వచ్చిందంటే చాలు.. విచిత్ర వేష ధారణలతో మగవారు ఆడవారి వేషధారణ (Men Turns into Women)లో అలంకరించుకొని రతి మన్మధులకు పూజలు జరుపుకోని మొక్కులు తీర్చుకుంటారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ గ్రామంలోని పురుషులు హోలీ సందర్బంగా స్త్రీల వేషాలు ధరించి.. ఇళ్ల నుంచి ర్యాలీగా బయలుదేరి.. రతీ మన్మథులకు ప్రత్యేక పూజలు చేశారు. పురుషులు చక్కగా ఆడవారిలా అలంకరించుకుని కుంభోత్సవంలో పాల్గొన్నారు. హోలీ పండుగ రోజు పురుషులు స్త్రీల వేషంలో మన్మథస్వామిని (Rathi Manmadha) దర్శించుకుంటే శుభం జరుగుతుందని, కోరికలు నెరవేరతాయన్నది ఇక్కడి గ్రామస్థుల నమ్మకం. కట్టు, బొట్టు, మాట తీరు.. ఇలా మొత్తం మహిళల మాదిరిగా సింగారించుకుంటారు.

తలపై నైవేద్యంతో నింపిన కుంభాన్ని పెట్టుకుని ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజల తర్వాత మళ్లీ తిరిగి ఇంటికి వస్తారు. సంతానం కలగని వారు, ఉద్యోగం రాని వారు, సమస్యలతో సతమవుతున్న వారు ఇలా.. అనేక రకాలు ఇబ్బంది పడేవారు ఇలా పూజలు నిర్వహిస్తారు. కోరిన కోర్కెలు నెరవేరిన కూడా స్త్రీల వేషధారణ ధరించి.. స్వామి వారిని పూజలు నిర్వహిస్తారు. ఉన్నత విద్యావంతులు, ఉద్యోగాలు చేస్తున్నవారు, రైతులు ఇలా అందరూ చీర కట్టి.. బంగాారు ఆభరణాలు ధరించి పూజలు చేస్తారు. ఈ సాంప్రదాయాన్ని గ్రామస్తులు తరతరాలుగా పాటిస్తున్నారు. నిన్న కూడా ఇలాగే చేసారు.

Read Also : Virat Kohli: ఛేజింగ్‌లో తగ్గేదే లే.. దటీజ్ కింగ్ కోహ్లీ..!

  Last Updated: 26 Mar 2024, 10:48 AM IST