Site icon HashtagU Telugu

Goutham Reddy Death: మంత్రి మృతిపై అసత్య ప్రచారం.. అస‌లు నిజాలు ఇవే..!

Mekapati Goutham Reddy

Mekapati Goutham Reddy

ఏపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి ఆక‌స్మిక‌ మృతిపై అస‌త్య ప్ర‌చారం మొద‌లైంది. ఒక‌వైపు గౌతమ్ రెడ్డి గుండెపోటుతో హఠాన్మరణం చెందడంతో రెండు తెలుగు రాష్ట్రాల్ని కుదిపేస్తే, మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో మాత్రం గౌతంరెడ్డి మృతి పై రూమ‌ర్స్ చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. నిజాల‌కంటే ముందుగా అబ‌ద్దాలు ప్ర‌పంచాన్ని చుట్టేసే ఈరోజుల్లో, మంత్రి మేక‌పాటి మృతి పై సోష‌ల్ మీడియాలో జోరుగా ప్ర‌చారం అవుతున్న వ‌దంతుల పై స్పందించిన‌ గౌతంరెడ్డి కుటుంబం క్లారిటీ ఇచ్చింది.

ఈ నేప‌ధ్యంలో గౌతంరెడ్డి వ్యాయామం చేస్తూ ఇబ్బందిపడ్డారన్న వార్తలు అవాస్తమ‌ని సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న రూమ‌ర్స్ అవాస్త‌వ‌మ‌ని స్ప‌ష్టం చేశారు. ఈ క్ర‌మంలో గౌతంరెడ్డి గ‌త రాత్రి ఇంటికి చేరుకున్నపట్టి నుంచి ఆయన ఉదయం నిద్ర లేవ‌గానే ఇబ్బంది పడడం, ఆ త‌ర్వాత‌ ఆస్పత్రికి తరలించడం, గౌతంరెడ్డి మృతిచెందినట్టు అపోలో వైద్యులు ప్రకటించేవరకు జరిగిన అన్ని విషయాల గురించి మేక‌పాటి గౌతంరెడ్డి ఫ్యామిలీ టైంతో సహా క్లారిటీ ఇచ్చింది.

* ఆదివారం రాత్రి జరిగిన ఓ ఫంక్షన్‌లో సంతోషంగా గడిపి రాత్రి 09.45 కల్లా ఇంటికి చేరిన మంత్రి మేకపాటి గౌతంరెడ్డి

* 06.00 గం.లకి.. రోజూలాగే ఉదయాన్నే మేల్కొన్న మంత్రి గౌతంరెడ్డి

* 06:30 గం.ల.. వరకు ఫోన్ కాల్స్‌తో కాలక్షేపం చేసిన మంత్రి మేక‌పాటి

* 07.00 గం.లకి.. ఆయ‌న‌ నివాసంలోని రెండో అంతస్తు సోఫాలో కూర్చుని ఉన్న మంత్రి గౌతంరెడ్డి

* 07:12 గం.లకి.. అత్యంత సన్నిహితంగా ఉండే మంత్రి డ్రైవర్ నాగేశ్వరరావును పిలవమని వంట మనిషికి చెప్పిన మంత్రి మేక‌పాటి

* 07:15 గం.లకి.. హఠాత్తుగా గుండెపోటుతో సోఫా నుంచి మెల్లిగా కిందకి ఒరిగిన మంత్రి గౌతంరెడ్డి

* 7:16 గం.లకి.. కంగారు పడి గట్టిగా అరిచిన మంత్రి మేకపాటి సతీమణి శ్రీకీర్తి

* 07:18 గం.ల‌కి .. పరుగుపరుగున వచ్చి గుండె నొప్పితో ఇబ్బందిపడుతున్న గౌతంరెడ్డి ఛాతిమీద చేయితో నొక్కి స్వల్ప ఉపశమనం కలిగించిన మంత్రి డ్రైవర్ నాగేశ్వరరావు

* 07:20 గం.లకి.. మంత్రి మేకపాటి గౌతంరెడ్డి పక్కనే ఉన్న భార్య శ్రీకీర్తి అప్రమత్తం అయ్యింది.

* 07:20 గం.ల‌కి.. మంచినీరు ఇచ్చినా, గౌతంరెడ్డి తాగలేని పరిస్థితుల్లో ఉండ‌డం గ‌మ‌నించిన భార్య శ్రీకీర్తి, మంత్రి వ్యక్తిగత సిబ్బందిని పిలిచింది.

* 07:22 గం.ల‌కి.. నొప్పి పెడుతుంది కీర్తి అని గౌతంరెడ్డి చెప్ప‌గా, స్పందించి భార్య శ్రీకిర్తి.. మంత్రి సిబ్బంది స‌హాయంతో ఆయ‌న్ని అపోలో ఆస్ప‌త్రికి తీసుకుని వెళ్ళారు.

* 07:27 గం.ల‌కి.. మంత్రి ఇంటి నుంచి అపోలో ఆస్పత్రికి గల 3 కి.మీ దూరాన్ని, అత్యంత వేగంగా కేవలం 5 నిమిషాల్లో అపోలో ఆస్పత్రిలోని అత్యవసర చికిత్స విభాగానికి చేర్చిన మంత్రి మేకపాటి డ్రైవర్ అండ్ సిబ్బంది.

* 08:15 గం.ల‌కి.. మంత్రి గౌతంరెడ్డి పల్స్ బాగానే ఉందని, సిట్యువేష‌న్ కంట్రోల్‌లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపిన అపోలో వైద్యులు.

* 09:13 గం.ల‌కి.. ఆ త‌ర్వాత విష‌మంగా మారిన మంత్రి గౌతంరెడ్డి ప‌రిస్థితి.. వైద్యులకు ఆయన పల్స్ దొరకలేదని, ఎంత ప్ర‌య‌త్నించినా, చికిత్సకు ఆయ‌న‌ శరీరం ఏమాత్రం సహ‌క‌రించ‌క‌పోవ‌డంతో, గౌతమ్ రెడ్డి మృతి చెందిన‌ట్టు నిర్ధారించిన అపోలో ఆస్పత్రి వైద్యులు

* 09:15 గం.ల‌కి.. మంత్రి మేకపాటి గౌతంరెడ్డి చనిపోయినట్లు అపోలో వైద్యులు అధికారికంగా ప్రకటించారు.

## సోషల్ మీడియాలో మంత్రి మేక‌పాటి గౌతంరెడ్డి మృతిపై ప్ర‌చారం అవుతున్న అవాస్తవాలను నమ్మొద్దని ఆయ‌న కుటుంబీకులు విజ్ఞప్తి చేశారు.