Site icon HashtagU Telugu

Jagan : జగన్ ఎప్పటికీ సీఎం కాలేడు – ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి

Mekapati Chandrasekhar Redd

Mekapati Chandrasekhar Redd

ఏపీలో మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగబోతున్న తరుణంలో రాష్ట్రంలో రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా అధికార – ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో 175 కి 175 సాధించి తీరుతామని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తుంటే..అంత సీన్ లేదని , 30 సీట్లు వస్తే గొప్పే అని టిడిపి నేతలు అంటున్నారు. తాజాగా వైసీపీ బహిష్కృత నేత, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి..కడపలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అయన జగన్‌పై విరుచుకుపడ్డారు. జగన్ ఇక జన్మ లో సీఎం కాలేరని ఆయన జోస్యం చెప్పారు.

We’re now on WhatsApp. Click to Join.

నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానన్న గౌరవం కూడా లేకుండా సీఎం జగన్ తనను కించపర్చారని చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. పార్టీ కోసం నెల్లూరు జిల్లాలో తాను చాలా కృషి చేశానని … లేనిపోని అనుమానాలతో తన టికెట్‌ను జగన్ అమ్మకానికి పెట్టారని ఆరోపించారు. అవగాహన రాహిత్యంతో రాష్ట్రాన్ని నాశనం చేశారని ధ్వజమెత్తారు. జగన్‌కు సీఎం పదవిని దేవుడు వరమిచ్చినట్లు గ్రహించాలన్నారు. జగన్ ప్రభుత్వంలో ఏ ఒక్క గ్రామం కూడా అభివృద్ధి చెందలేదని విమర్శించారు. అటు ప్రజలు కూడా బాగుపడిందేమి లేదన్నారు. విశాఖ రుషికొండలో సరదాగా భవనాలు కట్టుకున్నట్లుందని చంద్రశేఖర్ రెడ్డి ఎద్దేవా చేశారు.

Read Also : Daggubati Venkateswara Rao : గత ఎన్నికల్లో ఓడిపోవడమే మంచిదైంది – దగ్గుబాటి వెంకటేశ్వరరావు