పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రాజకీయాల్లోకి వచ్చి కొన్ని ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు అసెంబ్లీలోకి అడుగుపెట్టలేదు. తన అన్న చిరంజీవి (Chiranjeevi) ప్రజారాజ్యం (Prajarajyam) పార్టీ పెట్టిన సమయంలో అన్నకు తోడుగా అడుగులేసాడు. ఆ తర్వాత ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో కలిపినా తర్వాత కొద్దీ నెలలు సైలెంట్ అయ్యి..ఆ తర్వాత జనసేన పార్టీ స్థాపించి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. జనసేన స్థాపించి కూడా పదేళ్లు కావొస్తున్నా ఇప్పటివరకు తన ఫ్యామిలీ సపోర్ట్ కానీ చిత్రసీమ సపోర్ట్ కానీ కోరలేదు. ఆలా ఫ్యామిలీ సపోర్ట్..చిత్రసీమ సపోర్ట్ తీసుకోవాలని ఏనాడూ అనుకోలేదు. గత ఎన్నికల్లో రెండుచోట్ల పోటీ చేసినప్పటికీ..ఎక్కడ కూడా ఎవరి సపోర్ట్ తీసుకోకుండా ఉన్నాడు. ఆ సమాయంలో రెండుచోట్ల ఓడిపోయినప్పటికీ ..ఏమాత్రం కుంగిపోకుండా ప్రజల కోసం పనిచేస్తూ వచ్చారు. ఓ పక్క సినిమాలు…మరోపక్క రాజకీయాలు చేస్తూ వచ్చారు. సినిమాల ద్వారా సంపాదించిన డబ్బును పార్టీ కార్యక్రమాలకు , ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు సాయం చేస్తూ వచ్చారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక ఇప్పుడు పిఠాపురం నుండి అసెంబ్లీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నాడు. ఒంటరిగా వెళ్తే జగన్ ను ఓడించలేమనే ఉద్దేశ్యంతో బిజెపి , టిడిపి తో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. 21 అసెంబ్లీ , 2 పార్లమెంట్ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుంది. రీసెంట్ గా పవన్ తన ప్రచారాన్ని ప్రారంభించినప్పటి ఆరోగ్యం సహకరించకపోవడం తో ఇబ్బంది పడుతున్నారు. ఇదిలా ఉంటె ఈరోజు మెగాస్టార్ చిరంజీవి జనసేన పార్టీకి తనవంతు సహాయంగా రూ.5 కోట్లు ఇచ్చి ఒక్కసారిగా జనసేన గ్రాఫ్ పెంచారు. నిన్నటి వరకు చిరంజీవి..జనసేన కు దూరంగా ఉంటున్నారని , పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉండడం ఇష్టం లేదని , అందుకే ఇప్పటివరకు జనసేన కు ఆర్ధికంగా కానీ , మాట సాయం కానీ చేయలేదని వైసీపీ నేతలు విమర్శలు ఆరోపణలు చేస్తూ వచ్చారు. కానీ ఈరోజు మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఈసారి పవన్ కళ్యాణ్ కే అని తేలిపోయింది.
చిరంజీవి నేరుగా జనసేన కు ప్రచారం చేయకపోయినా..వెనుకాల మాత్రం తనవంతు సాయం చేస్తారని ఆర్డమైంది. అలాగే మెగా ఫ్యామిలీ ఈసారి పవన్ కళ్యాణ్ కోసం కదిలి రావడం ఖాయమా అనే చర్చ ఊపందుకుంది. మెగా ఫ్యామిలీ లో దాదాపు ఆరేడు మంది హీరోలున్నారు. వారిలో మెగాస్టార్‌ను పక్కన పెడితే.. నాగబాబు ఇప్పటికే జనసేన నేతల్లో ఒకరిగా ఉన్నారు. మిగిలిన యువ హీరోలు ఈసారి ప్రచారానికి రావడం పక్క అని తెలుస్తుంది. గత ఎన్నికల్లో సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ వంటి వారు వచ్చి భీమవరం, గాజువాకలో ప్రచారం చేసి వెళ్లారు. ఈసారి రామ్ చరణ్ , అల్లు అర్జున్ వంటి వారు పవన్ కోసం వస్తారని పార్టీ వర్గాలు , మెగా అభిమానులు భావిస్తున్నారు. ఒకవేళ వీరు వస్తే మాత్రం ఇక పవన్ కళ్యాణ్ ను ఆపడం ఎవరి తరం కాదని అంత మాట్లాడుకుంటున్నారు. చూద్దాం మరి..పవన్ కోసం ఎవరు రంగంలోకి దిగుతారో..!!
Read Also : CSK vs KKR: చెన్నై చెపాక్ లో జడేజా స్పిన్ మాయాజాలం