Allu Arjun Campaign: వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి రవిచంద్ర కిషోర్‌రెడ్డికి మద్దతుగా అల్లు అర్జున్ నంద్యాల వెళ్లడం రాజకీయంగా సంచలనంగా మారింది. సోషల్‌మీడియాలో మెగా అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్‌పైనే కాకుండా వైసీపీ యంత్రాంగం మొత్తం తమను అధికారం నుంచి దింపేందుకు పవన్ కళ్యాణ్ పోరాడుతున్నారని వారు వాదిస్తున్నారు. చిరంజీవి, రామ్ చరణ్, సాయిధరమ్ తేజ్, వర్జున్ తేజ్ మొదలుకొని మెగా హీరోలందరూ పవన్‌కు బహిరంగంగా మద్దతు తెలిపారు, కొంతమంది పిఠాపురంలో కూడా పవన్ కోసం ప్రచారం చేస్తున్నారు. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ చేస్తున్నది మెగా ఫ్యామిలీకి పూర్తి అన్యాయం అంటున్నారు.
అల్లు అర్జున్ రవి చంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు ఇవ్వడానికి అసలు కారణం ఇద్దరి సతీమణులు స్నేహితులు కావడం అలాగే రెండు కుటుంబాలు రాజకీయాలకు అతీతంగా బలమైన బంధాన్ని పంచుకోవడం. అయితే జగన్‌తో పవన్ కళ్యాణ్ రాజకీయంగా పోరాడుతున్నారు. ఈ సమయంలో అల్లు అర్జున్ వైసీపీ నేతకు మద్దతు ఇవ్వడం రాజకీయంగా చర్చనీయాంశం అయింది. మరోవైపు మెగా ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య ఇప్పటికే గ్యాప్ ఏర్పడగా, ఇప్పుడు అది మరింత పెరగనుంది. సోషల్ మీడియాలో ఇప్పటికే మెగా ఫ్యాన్స్ పుష్ప 2 సినిమాపై ట్రోల్స్ చేస్తున్నారు. నంద్యాల వైసీపీ అభ్యర్థి రవిచంద్ర కిషోర్‌రెడ్డి ఓడిపోతే, అల్లు అర్జున్ మెగా అభిమానుల నుండి మరింత ట్రోల్‌లను ఎదుర్కొవాల్సి ఉంటుంది.
Also Read: Polling Staff : పోలింగ్ సిబ్బందికి గుడ్లు మాత్రమే.. చికెన్ నో..!