Mega Sena: మెగా కాంపౌండ్లో జన ‘సై’

మెగా హీరోలు మళ్ళీ ఒకే రాజకీయ వేదికను ఎక్కబోతున్నారు. ప్రజారాజ్యం కు ఎలా కలిసి కట్టుగా పని చేశారో ..ఆ విధంగా ముందుకు నడవాలని తలపోస్తున్నారు.

  • Written By:
  • Updated On - February 17, 2022 / 05:53 PM IST

మెగా హీరోలు మళ్ళీ ఒకే రాజకీయ వేదికను ఎక్కబోతున్నారు. ప్రజారాజ్యం కు ఎలా కలిసి కట్టుగా పని చేశారో ..ఆ విధంగా ముందుకు నడవాలని తలపోస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఫ్యామిలి మొత్తం రంగంలోకి దిగనుంది. ఆ మేరకు హీరో రాంచరణ్ సంకేతం ఇచ్చాడు. బాబాయ్ పవన్ కు అండగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఆ మేరకు ప్రకటన చేసాడు. ఆ ప్రకటన వెనుక చిరంజీవి లేడని అనుకోలేం. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీని అధికారికంగా వీడలేదు. ఆ పార్టీకి రాజీనామా చేయలేదు. పార్టీ కార్యక్రమాలకు మాత్రం దూరంగా ఉంటున్నారు. రాజకీయాలకు ఇక దూరం అంటూ ప్రకటించాడు. కానీ ఏదో ఒక సందర్భంలో ఆయన పేరు రాజకీయ తెర మీదకు వస్తుంది. ఇటీవల ఏపీ సీఎం జగన్ తో భేటీ అయిన సందర్భంగా ఆ పార్టీలోకి వెళతారని ప్రచారం జరిగింది. ఒకానొక సందర్భంలో బీజేపీలో కి వెళతాడాని టాక్ నడిచింది. ప్రస్తుతం జగన్ తీసుకున్న నిర్ణయాలను చిరు సమర్ధిస్తున్నాడు. మూడు రాజధానులు అంశాన్ని స్వాగతించాడు. అదే జనసేనాని వ్యతిరేకించాడు. ఇలా చిరు, పవన్ మధ్య కొంత అభిప్రాయభేధాలు ఉన్నాయి. కానీ చరణ్ మాత్రం పవన్ పార్టీకి జై కొట్టాడు.

ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు పవన్ యువరాజ్యం అధ్యక్షుడుగా ఉన్నాడు. కాంగ్రెస్ లో విలీనం సమయంలోనూ ఆయన ఉన్నాడు. ఆ పార్టీ ని గెలిపించడానికి 2009లో మెగా హీరోలు అందరూ ప్రత్యేక రైలు షో చేశారు. దాదాపు చిరంజీవి తో కలుపుకొని డజను మంది మెగా హీరోలు ప్రచారంలోకి ఆనాడు దిగారు. చివరకు 18 స్థానాలకు ఆ ఎన్నికల్లో గెలుచారు. ఆ తరువాత పార్టీని నడపలేక కాంగ్రెస్ లో విలీనం చేశారు.
మళ్ళీ 2014 ఎన్నికలకు ముందు పవన్ జనసేన పార్టీని స్థాపించాడు. తొలి రోజుల్లోనే ప్రజారాజ్యం విలీనం అంశం పవన్ ను వేటాడింది. కానీ పార్టీని నడుపుతూ వస్తున్నాడు. తెలంగాణలో దాదాపుగా లేదని చెప్పుకోవాలి. ఇక ఏపీలో జనసేన బలపడేలా పవన్ చేస్తున్న ప్రయత్నం సీరియస్ గా లేదు. ఆ మేరకు తరచూ ప్రత్యర్థుల నుంచి విమర్శలు వస్తుంటాయి. వాటిని పట్టించుకోని పవన్ ఒకానొక సందర్భంలో ఢిల్లీ పెద్దలు విలీనంపై ఒత్తిడి చేస్తున్నారని పరోక్షంగా బీజేపీ పేరు చెప్పాడు. ఇప్పుడు ఆ పార్టీతో పొత్తు ఉంది. ఎంత కాలం ఇది ఉంటుందో తెలియదు. పొత్తులపై కూడా పవన్ ఇటీవల మాట్లాడాడు. ఒక వేళ పవన్ బీజేపీ నుంచి బయటకు వస్తే విలీనం ఒత్తిడి మళ్ళీ తెర మీదకు వచ్చే ఛాన్స్ ఉంది.
ఇలాంటి పరిస్థితుల్లో రాం చరణ్ బాబాయ్ పవన్ కు మద్దతు ప్రకటించటం సరికొత్త సమీకరణానికి స్కెచ్ వేస్తున్నట్టు మెగా కాంపౌండ్ టాక్. యువ హీరోలతో పవన్ ఏదో ప్లాన్ చేస్తున్నాడు అని అభిమానులు భావిస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ తో కలిసి వెళ్ళడానికి రెండేళ్ళ క్రితం జరిగిన తానా సభల్లోన్నే ఒక అవగాహనకు ఆ రెండు పార్టీలు వచ్చాయని అప్పట్లో బాగా వినిపించింది. ఇపుడు మళ్ళీ ఆ టాక్ బలం పుంజుకుంది. కానీ ఆ రెండు పార్టీలు అధికారికంగా ఇప్పుడు బయట పడకుండా స్నేహాన్ని నడుపుతున్నాయి. అకస్మాత్తుగా రాం చరణ్ రంగంలోకి దిగడంతో మెగా రాజకీయ ప్లాన్ మీద చర్చ మొదలు అయింది. మళ్ళీ ఆనాడు ప్రజారాజ్యం కు ర్యాలీ అయినట్టు జనసేన కోసం ఏకం అవుతారా ?అప్పుడు మారే రాజకీయ పరిణామాలపై సీరియస్ చర్చ కు చరణ్ తెరలేపాడు. సో భవిష్యత్లో ఏమి జరుతుందో చూద్దాం.!