ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ ఫలితాలు (Mega DSC Results) వచ్చేసాయి. వాటిని చూసుకోవడానికి https://apdsc.apcfss.in లింక్‌ని క్లిక్ చెయ్యండి. 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను ఇప్పుడు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.
అభ్యర్థులు తమ ఫలితాలను చూసుకోవడానికి ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి:
ముందుగా, అధికారిక వెబ్‌సైట్ https://apdsc.apcfss.in ను ఓపెన్ చేయండి.
హోమ్‌పేజీలో కనిపించే “AP DSC Results 2025” లింక్‌పై క్లిక్ చేయండి.
అక్కడ అడిగే మీ రూల్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ వంటి వివరాలను నమోదు చేయండి.
“సబ్‌మిట్” బటన్‌పై క్లిక్ చేసిన తర్వాత మీ ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
భవిష్యత్ అవసరాల కోసం ఆ ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింట్ తీసుకోవడం మంచిది.
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఈ మెగా డీఎస్సీ నిర్వహించింది. ఈ పరీక్షకు మొత్తం 3,36,307 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది జూన్ 6వ తేదీ నుండి జులై 2వ తేదీ వరకు 23 రోజుల పాటు పరీక్షలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశాలలో కూడా పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలకు 92.90 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు.
మెగా డీఎస్సీ పరీక్ష కన్వీనర్ కృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. అభ్యర్థులు పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ తుది ఫలితాలు, స్కోర్ కార్డులను పొందవచ్చు. టెట్ వివరాలకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే, అభ్యర్థులు తమ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి వివరాలను సరిచేసుకునే అవకాశం ఉంది. అయితే, ఈ అవకాశం కేవలం రెండు రోజులు మాత్రమే అంటే ఆగస్ట్ 13వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
Gut Health : మీ ఒంట్లో విషవాయువులు పెరిగిపోతున్నాయా..? వన్స్ గట్ హెల్త్ చెక్ చేసుకోండి