రాష్ట్ర నిరుద్యోగులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఏపీ మెగా DSC 2025 నోటిఫికేషన్ (Mega DSC Notification) విడుదలైంది. పాఠశాల విద్యాశాఖ ఈ నోటిఫికేషన్‌ను ఏప్రిల్ 20న అధికారికంగా విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఈ మెగా నోటిఫికేషన్ ఇచ్చారు. అభ్యర్థులు ఏప్రిల్ 20 నుంచి మే 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఫీజు చెల్లింపులు కూడా ఇదే గడువులో పూర్తి చేయాలి. ఇది ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు మంచి అవకాశంగా మారింది.
Nara Chandrababu : జయహో చంద్రబాబు.. 75వ బర్త్‌డే వేళ జీవన విజయ విశేషాలివీ
విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ఈ నోటిఫికేషన్ విడుదలను శనివారం ఎక్స్ ఖాతాలో ప్రకటిస్తూ, ఉత్తమ ఉపాధ్యాయుల నియామకమే విద్యా రంగాభివృద్ధికి బలమని పేర్కొన్నారు. పరీక్షల షెడ్యూల్ ప్రకారం మాక్ టెస్ట్‌లు మే 20 నుంచి ప్రారంభం కానున్నాయి. హాల్‌టికెట్లు మే 30నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ పరీక్షలు జూన్ 6 నుంచి జూలై 6 వరకు నిర్వహించనున్నారు. ప్రాథమిక కీ అన్ని పరీక్షలు ముగిసిన రెండో రోజే విడుదలవుతుంది. అభ్యంతరాలను ఏడురోజులపాటు స్వీకరించనున్నారు. అనంతరం తుది కీ విడుదల చేసి, ఫైనల్ మెరిట్ జాబితాను మరో 7 రోజుల్లో ప్రకటించనున్నారు.
LSG Beat RR: ఇది మామూలు మ్యాచ్ కాదు బాబోయ్.. గెలిచే మ్యాచ్‌లో ఓడిపోయిన రాజస్థాన్!
ఈ మెగా DSCలో జిల్లా స్థాయిలో 14,088 పోస్టులు, రాష్ట్ర-జోనల్ స్థాయిలో 2,259 పోస్టులు ఉన్నాయి. SGT పోస్టులు 6,599, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 7,487, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు కూడా ఇందులో ఉన్నాయి. ప్రభుత్వ, జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, పురపాలక పాఠశాలల్లో 13,192 పోస్టులు, గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో 881, జువెనైల్ స్కూల్స్‌లో 15, దివ్యాంగుల పాఠశాలల్లో 31 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు పూర్తి వివరాలు, సిలబస్, పరీక్షా షెడ్యూలు మొదలైనవన్నీ http://apdsc.apcfss.in/# అనే అధికారిక వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.