ఆంధ్రప్రదేశ్ సర్కారు (AP Govt) మెగా డీఎస్సీ (Mega DSC) నోటిఫికేషన్ ప్రకటించేందుకు సిద్ధం అవుతుంది. ఇప్పటీకే దీనిపై పాఠశాల విద్యాశాఖ (School Education Department) కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం. నవంబర్ మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు వినికిడి. ఈసారి, ఎటువంటి న్యాయ వివాదాలు ఎదురుకాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం. ప్రభుత్వం మూడు లేదా నాలుగు నెలల్లో భర్తీ ప్రక్రియ పూర్తిచేసి, ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తం 16,347 పోస్టులతో ఈ నోటిఫికేషన్ విడుదల కానుంది. దీని ద్వారా పెద్దమొత్తం ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి.
ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ (AP DSC) నోటిఫికేషన్ విడుదలపై నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 16,347 పోస్టులతో ఇది రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాల్లో చాలా పెద్ద మొత్తంలో అవకాశం. ఈ నియామక ప్రక్రియలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో వివిధ ఉపాధ్యాయ పదవులను భర్తీ చేయడం జరుగుతుంది. ఈ నియామక ప్రక్రియ ద్వారా రాష్ట్రంలోని పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీలను తక్షణం భర్తీ చేసి, విద్యా ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ్యంగా తెలుస్తుంది.
Read Also : Ponguleti Srinivasa Reddy : సాక్ష్యాధారాలతో యాక్షన్ లోకి దిగుతున్నామంటూ పొంగులేటి హెచ్చరిక