Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతో ఉత్కంఠతో ఎదురుచూసిన మెగా డీఎస్సీ (DSC) పరీక్షలు సజావుగా ముగిశాయని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. కేవలం 23 రోజులకే అనేక సవాళ్లను ఎదుర్కొంటూ పరీక్షల ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయగలిగామని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, డీఎస్సీని అడ్డుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కుట్రలు పన్నిందని మంత్రి ఆరోపించారు. మొత్తం 31 కోర్టు కేసులు దాఖలు చేసినప్పటికీ, వాటిని అధిగమించి న్యాయబద్ధంగా పరీక్షలను నిర్వహించామని పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా మెగా డీఎస్సీకి 3.36 లక్షల మంది అభ్యర్థులు 5.77 లక్షల దరఖాస్తులు చేసుకున్నారని, పరీక్షలకు 92.9% హాజరైనట్లు మంత్రి లోకేశ్ వివరించారు. ఎస్సీ ఉపవర్గీకరణ, స్పోర్ట్స్ కోటా వంటి అన్ని కోటాల నిబంధనలను విధిగా పాటించామన్నారు.
పరీక్షల విజయవంతమైన నిర్వహణలో పాలుపంచుకున్న విద్యాశాఖ అధికారులందరికీ లోకేశ్ ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికే ప్రాథమిక కీ విడుదల చేసినట్టు, అభ్యంతరాల పరిశీలన అనంతరం తుది కీను త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపారు.
Trump: ట్రంప్ అల్టిమేటం.. జూలై 9 డెడ్‌లైన్‌తో అమెరికా వాణిజ్య ఒప్పందాలపై క్లారిటీ