Site icon HashtagU Telugu

AP Mega DSC: మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా..?

Ap Mega Dsc

Ap Mega Dsc

AP Mega DSC: ఏపీ రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ-2024 నోటిఫికేషన్ విడుదల మరింత ఆలస్యం కానున్నట్లు సమాచారం. అయితే.. ముందుగా నవంబర్ 6న షెడ్యూల్ ప్రకారం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉండగా, కొన్ని అనివార్య కారణాల వల్ల అది వాయిదా పడినట్లు తెలుస్తోంది. తాజాగా, సోమవారం టెట్ ఫలితాలు ఆన్‌లైన్‌లో విడుదల అయినప్పటికీ, మెగా డీఎస్సీ నోటిఫికేషన్ మరొక రెండు రోజులలో విడుదల అవుతుందని పాఠశాల విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు.

అయితే, ఎస్సీ వర్గీకరణ (SC Classification) అమలు చేసే వరకు ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేయకూడదని ఎమ్మార్పీఎస్ (MRPS) తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఎస్సీ రిజర్వేషన్లతో అన్యాయం జరిగే అవకాశం ఉందని ఆ సంఘం ఆక్షేపించింది. ఈ నేపథ్యంతో ఎస్సీ రిజర్వేషన్ల అమలు అంశం క్లారిటీకి రాకపోవడంతో, డీఎస్సీ నోటిఫికేషన్ మరింత ఆలస్యం కావచ్చునని విద్యాశాఖ అధికారులు తెలిపారు.

మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 16,347 పోస్టుల భర్తీ జరగనుంది. వాటిలో:

సెకండరీ గ్రేడ్ టీచర్లు (SGTs) – 6,371
స్కూల్ అసిస్టెంట్లు (SAs) – 7,725
ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు (TGTs) – 1,781
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు (PGTs) – 286
ప్రిన్సిపాల్స్ – 52
వ్యాయామ ఉపాధ్యాయులు (PETs) – 132

ఈ నోటిఫికేషన్ విడుదల తేదీ ఇంకా ఖరారైంది కానీ, ఎస్సీ రిజర్వేషన్ల సమస్యను సరిచేయడం వరకు నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం కాబోతుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఈసారి పరీక్షలు ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్నందున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. SGT పోస్టులకు సిద్ధపడేవారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో పరీక్షల నిర్వహణకే వారం రోజులు పట్టవచ్చని సమాచారం. ఈ క్రమంలో 2-3 జిల్లాలకు కలిపి ఒకేసారి పరీక్ష నిర్వహిస్తే ఎలా ఉంటుందనేది విద్యాశాఖ ఆలోచిస్తోంది.

Read Also : Rahul Gandhi : నేడు మహారాష్ట్రకు రాహుల్‌ గాంధీ.. నాగ్‌పూర్ నుంచి ప్రచారం షురూ