జనసేనధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ను మీడియా (Media) పట్టించుకోవడం లేదా..? అంటే అవుననే అంటున్నారు అభిమానులు, జనసేన (Janasena) శ్రేణులు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రాకముందు..పవన్ కళ్యాణ్ ను కవరేజ్ చేయాలనీ అన్ని మీడియాలు ఎంతో ఆతృతగా ఉండేవి..ఆయన ఏ ఫంక్షన్ వస్తాడు..? ఎక్కడ కనిపిస్తాడు..? ఇంటర్వ్యూ కు ఛాన్స్ ఇస్తారా..? అని తెగ ట్రై చేసేవారు. ఒకవేళ పవన్ ఇంటర్వ్యూ దొరికిన , ఆయన ను కవరేజ్ చేసే ఛాన్స్ వచ్చిన పండగ చేసుకునేవి. కానీ ఇప్పుడు అంత రివర్స్ అయ్యింది.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ గా ఉంటూ..ప్రతి రోజు ఏదో రకంగా బయట కనిపిస్తున్న ఆయన్ను కవర్ చేసేందుకు మీడియా చానెల్స్ పెద్దగా ఇంట్రస్ట్ చూపించడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా పాపులర్ అయినా చానెల్స్ , మీడియా సంస్థలు పవన్ కళ్యాణ్ ను పూర్తిగా పక్కకు పెట్టేశాయి. ఆయన సభలు పెట్టిన ఏదో హెడ్ లైన్స్ కు మాత్రమే పరిమితం చేస్తున్నాయి తప్ప కవరేజ్ మాత్రం చేయడం లేదు. దీంతో పవన్ కళ్యాణ్ పార్టీ కానీ , ఆయన ప్రసంగాలు కానీ ఏవి కూడా ప్రజల్లోకి వెళ్లడం లేదని అభిమానులు , పార్టీ శ్రేణులు బాధపడుతున్నారు.
ప్రస్తుతం దేనికైనా ప్రచారం అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. అలాంటిది రాజకీయ పార్టీలకు ప్రచారం అనేది ముఖ్యం. కానీ పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రమే అలాంటిదే లేకుండా పోతుంది. రెండు, మూడు చానెల్స్ కవరేజ్ చేసినప్పటికీ..ఆ చానెల్స్ ప్రజలకు పెద్దగా తెలియజేయకపోవడం తో పవన్ అసలు బయటకు వచ్చిన సంగతి కానీ , ఆయన తన పార్టీ ద్వారా ఏంచేస్తున్నాడనేది కూడా తెలియకుండా అవుతుంది.
ఇక సోషల్ మీడియా విషయంలోను కాస్త జనసేన హావ తగ్గింది. టీడీపీ తో పొత్తు పెట్టుకోకముందు సోషల్ మీడియా సైనికులు పార్టీ కి సంబదించిన అనేక విషయాలను , పవన్ ప్రసంగాలను ప్రజలకు చేరవేసేలా చేసారు..కానీ టిడిపి తో పొత్తు తరువాత అది కూడా తగ్గించారు. పార్టీ అఫీషయల్ పేజీ లో తప్ప..పెద్దగా ఎక్కడ ప్రచారం జరగడం లేదు. మరో రెండు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ క్రమంలో ప్రచారం ఎంత బాగా చేస్తే అంత మేలు జరుగుతుంది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ప్రతి విషయంలో నెమ్మదిగా ఉండడం తో అభిమానులకు , పార్టీ శ్రేణులకు నచ్చడం లేదు.
ఈరోజుల్లో ఏ పార్టీ ఐన మీడియా చానెల్స్ ను తమ డబ్బుతో కొనుగోలు చేసి తమ గ్రిప్ లో పెట్టుకుంటున్నారు. అలాంటిది పవన్ కళ్యాణ్ ఎందుకు తమ పార్టీ కి అంటూ ఓ మీడియా ఛానల్ ను కానీ మీడియా సంస్థలను కానీ ఎందుకు పెట్టుకోవడం లేదని సగటు కార్యకర్తలు ప్రశ్నింస్తున్నారు. ప్రస్తుతం వైసీపీ , టిడిపి పార్టీలకు తమకంటూ కొన్ని మీడియా చానెల్స్ చేతిలో ఉన్నాయి. అలాగే సోషల్ మీడియా పేజీ లు సైతం నడిపిస్తూ..ప్రచారం చేసుకుంటున్నారు. జనసేన అధినేత పవన్ మాత్రం..బ్యాక్ గ్రాండ్ లో అంత పలుకుబడి , ఓ మాట అడిగితే పరుగెత్తి ప్రచారం చేసే సంస్థలు ఉన్నప్పటికీ వారిని ఉపయోగించుకోలేకపోతున్నాడని అంత వాపోతున్నారు.
ఇప్పటికైనా ప్రచారం విషయంలో పవన్ కాస్త జోష్ పెంచాలని , సోషల్ మీడియా లోను యాక్టివ్ కావాలని , ఇక జనాల మధ్య ఎక్కువగా సమయం కేటాయించాలని కోరుతున్నారు. నాల్గు గోడల మధ్య సమావేశాలు పెడితే ప్రయోజనం ఉండదని..నాల్గు లక్షల మధ్య సమావేశాలు పెట్టాలని , ప్రజల మధ్య ఉంటూ అధికార పార్టీ ఫై యుద్ధం చేస్తే కానీ గెలవమని కార్యకర్తలు అంటున్నారు. మరి పవన్ ఇప్పటికే తన ఆలోచనను మారుస్తారేమో చూడాలి.
Read Also : Vijay Devarakonda: విజయ్ దేవరకొండపై అలాంటి వీడియో చేసిన లేడీ ఫ్యాన్స్.. రౌడీ హీరో రియాక్షన్ ఇదే?