Hema Malini: ప్రముఖ బాలీవుడ్ నటి, బీజేపీ నాయకురాలు హేమా మాలిని (Hema Malini) తన గ్యారేజీలో కొత్త లగ్జరీ కారును చేర్చుకున్నారు. ఆమె ఇటీవల మార్కెట్లో విడుదలైన ఎంజి ఎం9 ఎంపివి (MG M9 MPV) కారును కొనుగోలు చేశారు. జూలై 2025లో భారత మార్కెట్లోకి వచ్చిన ఈ కారు ప్రారంభ ధర రూ. 69.90 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ లగ్జరీ కారులోని ఫీచర్లు, విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఎంజి ఎం9 లగ్జరీ ఇంటీరియర్
ఎంజి ఎం9 కారులోని ప్రధాన ఆకర్షణ దాని సౌకర్యం, లగ్జరీ ఫీచర్లు. ఇందులో 16-వే అడ్జస్టబుల్ సీట్లు, 8 రకాల మసాజ్ మోడ్స్, హీటింగ్, వెంటిలేషన్ ఫీచర్లు ఉన్నాయి. వీటితో పాటు డ్యూయల్ సన్‌రూఫ్, 64 రంగుల యాంబియంట్ లైటింగ్ సిస్టమ్ వంటివి కూడా ఉన్నాయి. సంగీత ప్రియుల కోసం ఇందులో సబ్‌వూఫర్, యాంప్లిఫైయర్‌తో కూడిన 13-స్పీకర్ సౌండ్ సిస్టమ్ కూడా ఉంది. ఈ ప్రత్యేక సౌకర్యాల వల్లే హేమా మాలిని ఈ కారును ఎంచుకున్నారని తెలుస్తోంది.
శక్తివంతమైన బ్యాటరీ, అద్భుతమైన పర్ఫార్మెన్స్
హేమా మాలిని కొనుగోలు చేసిన ఈ కొత్త కారు ఒక ఎలక్ట్రిక్ ఎంపివి. ఇందులో 90 kWh ఎన్‌ఎంసి (NMC) బ్యాటరీ ఉంది. ఈ బ్యాటరీ 245 హెచ్‌పి (hp) శక్తి, 350 ఎన్‌ఎం (Nm) టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే ఈ కారు 548 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని కంపెనీ తెలిపింది. కారుతో పాటు 11 kW వాల్ బాక్స్ ఛార్జర్, 3.3 kW పోర్టబుల్ ఛార్జర్ కూడా లభిస్తాయి.
Also Read: Job Market: భారతదేశంలో ఈ ఉద్యోగాలకు భారీగా డిమాండ్!
ఉత్తమ వారంటీ ప్యాకేజ్
ఎంజి సంస్థ ఈ కారుకు ప్రత్యేక వారంటీని అందిస్తోంది. మొదటి యజమానికి హై-వోల్టేజ్ బ్యాటరీపై లైఫ్‌టైమ్ వారంటీ లభిస్తుంది. అలాగే మొత్తం కారుపై 3 సంవత్సరాలు/అపరిమిత కిలోమీటర్ల వారంటీ కూడా లభిస్తుంది. ఇది వినియోగదారులకు కొనుగోలు తర్వాత కూడా దీర్ఘకాలిక భద్రతను ఇస్తుంది.
ఎక్స్‌టీరియర్ డిజైన్, లుక్స్
ఎంజి ఎం9 మూడు రంగుల్లో అందుబాటులో ఉంది. పర్ల్ లస్టర్ వైట్, మెటల్ బ్లాక్, కాంక్రీట్ గ్రే. దీని డిజైన్ చాలా మోడ్రన్‌గా, ప్రీమియంగా ఉంటుంది. ముందు భాగంలో బోల్డ్ ట్రాపెజాయిడల్ మెష్ గ్రిల్, స్ప్లిట్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్స్, కనెక్టెడ్ డీఆర్‌ఎల్‌లు (DRL’s) ఉన్నాయి. వెనుక భాగంలో వాటర్‌ఫాల్-స్టైల్ ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఈడీ టెయిల్‌లైట్లు మరింత ఆకర్షణీయంగా ఉన్నాయి. 19-అంగుళాల కాంట్‌సీల్టీఎం (ContiSealTM) సెల్ఫ్-సీలింగ్ టైర్లు, హీటెడ్ ఓఆర్‌విఎంలు (ORVMs) భద్రత, సౌలభ్యాన్ని పెంచుతాయి.