Master CBN : అడ్మినిస్ట్రేట‌ర్ చంద్ర‌బాబు,కొత్త పంథా!

వివిధ అంశాల‌పై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబునాయుడు  (Master CBN) వినూత్నంగా ప్ర‌జ‌ల మ‌ధ్య చ‌ర్చ పెడుతున్నారు.

  • Written By:
  • Publish Date - July 27, 2023 / 02:27 PM IST

వివిధ అంశాల‌పై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబునాయుడు  (Master CBN) వినూత్నంగా ప్ర‌జ‌ల మ‌ధ్య చ‌ర్చ పెడుతున్నారు. బ‌హిరంగ స‌భ‌లకు ఇటీవ‌ల దూరంగా ఉంటున్నారు. వాస్త‌వ ప‌రిస్థితుల‌ను తెలియ‌చేయ‌డానికి ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ను ఎంచుకున్నారు. కంపెనీ సీఈవో మాదిరిగా ఆయ‌న వివ‌రిస్తున్నారు. అందుకే, ఆయ‌న్ను ఆడ్మినిస్ట్రేట‌ర్ గా ఆ పార్టీలోని వాళ్లే చెబుతుంటారు. పొలిటీషియ‌న్ కు ఉండే ల‌క్ష‌ణాల కంటే కంపెనీ న‌డిపే సీఈవో త‌ర‌హా ఆలోచ‌న‌లు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని ప్రైవేటు సంభాష‌ణ‌ల్లో అభిప్రాయాల‌ను పంచుకుంటారు. దానికి కార‌ణాలు లేక‌పోలేదు.

వివిధ అంశాల‌పై చంద్ర‌బాబునాయుడు  వినూత్నంగా ప్ర‌జ‌ల మ‌ధ్య చ‌ర్చ (Master CBN)

స‌మ‌కాలీన రాజ‌కీయాల‌ను గ‌మ‌నిస్తే, ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను ఇప్పుడున్న లీడ‌ర్లు సొంతానికి ఉప‌యోగించుకుంటున్నారు. ప్ర‌త్య‌ర్థి పార్టీల‌ను నిర్వీర్యం చేయ‌డానికి వాటిని ఉప‌యోగించుకుంటున్నారు. బ‌ల‌మైన ఆర్థిక మూలాల మీద దెబ్బ‌కొడుతున్నారు. రాజ‌కీయ శ‌త్రువులుగా ప్ర‌త్య‌ర్థి పార్టీల‌ను భావిస్తున్నారు. సీఐడీ, ఏసీబీ, పోలీస్ వ్య‌వ‌స్థ‌ల‌ను రాజ‌కీయ ఎదుగుద‌ల కోసం వాడుతున్నారు. మునుపెన్న‌డూ ఇలాంటి ప‌రిస్థితి ఉండేది కాదు. కేంద్ర నుంచి తెలుగు రాష్ట్రాల వ‌ర‌కు ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను సొంత పార్టీల ఎదుగుద‌ల కోసం అస్త్రాలుగా వాడుకుంటున్నారు. కానీ, చంద్ర‌బాబు రాజ‌కీయ ప్ర‌స్థానంలో (Master CBN) ఎప్పుడూ ఆ స్థాయి దుర్వినియోగం జ‌ర‌గ‌లేదని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు.

అబ్దుల్ క‌లాంను ఎంపిక చేయ‌డంలోనూ చంద్ర‌బాబు కీల‌క రోల్

ఉమ్మ‌డి ఏపీకి సుదీర్ఘ‌కాలం సీఎంగా చంద్ర‌బాబు (Master CBN)ప‌నిచేశారు. ఆయ‌న 1995 నుంచి 2004 వ‌ర‌కు సీఎం కొన‌సాగారు. అంతేకాదు, లోక్ స‌భ‌లో ప్ర‌తిప‌క్ష పార్టీగా టీడీపీ ఉండేది. ఆ స్థాయిలో పార్టీని చంద్ర‌బాబు నిలప‌గ‌లిగారు. అప్పుడు ప్ర‌ధాన మంత్రి అభ్య‌ర్థి, రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థుల‌ను నిర్ణ‌యించే కెపాసిటీ ఆయ‌న‌కు ఉండేది. కేంద్ర ప్ర‌భుత్వాన్ని ఒక ర‌కంగా చెప్పాలంటే ఆయ‌నే న‌డిపారు. ఆనాడు ప్ర‌ధాన మంత్రి అభ్య‌ర్థిగా వాజ‌పేయ్ ను అపారంగా చంద్ర‌బాబు గౌర‌వించారు. రాష్ట్ర‌ప‌తిగా అబ్దుల్ క‌లాంను ఎంపిక చేయ‌డంలోనూ చంద్ర‌బాబు కీల‌క రోల్ పోషించారు. లోక్ స‌భ స్పీక‌ర్ గా ఎస్సీ మాల సామాజిక‌వ‌ర్గం నుంచి బాల‌యోగిని ఎంపిక చేయ‌డంలోనూ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించారు.

మీడియాలో వ‌చ్చిన న్యూస్ కు ప్రాధాన్యం ఎక్కువ‌గా (Master CBN)

వ్య‌వ‌స్థ‌ల‌ను మేనేజ్ చేశార‌ని చాలా మంది భావిస్తుంటారు. కానీ, ఆయ‌న వ్య‌వ‌స్థ‌ల‌కు గౌర‌వం ఎక్కువ‌గా ఇచ్చారు. ఐఏఎస్, ఐపీఎస్ ల‌కు స్వేచ్ఛ‌ను ఇచ్చారు. వాళ్ల‌దే పాల‌న అన్న‌ట్టు ఉండేది. సొంత పార్టీలోని మంత్రులు కూడా సివిల్ స‌ర్వెంట్ల‌ను కాద‌ని ముందుకు అడుగు వేసే వాళ్లు కాదు. మీడియాలో వ‌చ్చిన న్యూస్ కు ప్రాధాన్యం ఎక్కువ‌గా ఉండేది. తెల్లారేస‌రికి న్యూస్ మీద స‌మీక్ష ఉండేది. ప్ర‌త్య‌ర్థుల నుంచి వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌ను కూడా సీరియ‌స్ గా తీసుకునే వాళ్లు. వాటిలోని నిజాలు ఏమిటి? అనే దానిపై విచార‌ణ జ‌రిపేలా పాల‌న ఉండేది. కొన్ని మీడియా సంస్థ‌లు ఆ రోజున ఆయ‌న పాల‌న మీద విప‌రీతంగా వ్య‌తిరేక వార్త‌ల్ని వండివార్చేవి. కానీ, వాటి మీద ఏనాడూ క‌క్ష్య సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ‌లేదు. లైజ‌నింగ్ చేసిన సంద‌ర్భాలు ఉన్నాయోమోగానీ, బ్లాక్ మెయిల్ చేసిన (Master CBN)దాఖ‌లాలు లేవు.

రాజ‌కీయంగా ప్ర‌త్య‌ర్థులుగా భావించారు మిన‌హా శ‌త్రువులుగా

ప్ర‌జాస్వామ్యబ‌ద్ధంగా అంతా ఉండాల‌ని చంద్ర‌బాబు (Master CBN)ఆనాడు భావించారు. అందుకే, తెలంగాణ ఉద్య‌మాన్ని కేసీఆర్ న‌డ‌ప‌గ‌లిగారు. కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయాల‌ని ఏనాడూ ఆలోచ‌న చేయ‌లేదు. ప్ర‌త్య‌ర్థుల ఆర్థిక మూలాల‌ను నిర్వీర్యం చేయాల‌ని అనుకోలేదు. న‌క్స‌లైట్ల‌ను సైతం న‌మ్మించి మోసం చేయాల‌ని భావించ‌లేదు. ఆనాడు ప్ర‌తిప‌క్ష నేత‌గా రాజ‌శేఖ‌ర్ రెడ్డి చేసిన పాద‌యాత్ర‌ను అడ్డుకోలేదు. అంతేకాదు, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేసిన పాద‌యాత్ర‌కు అడ్డుంకులు పెట్ట‌లేదు. ప్ర‌త్య‌ర్థి పార్టీలుగా మాత్ర‌మే చూశారు. రాజ‌కీయంగా ప్ర‌త్య‌ర్థులుగా భావించారు మిన‌హా శ‌త్రువులుగా చూడ‌లేదు. అందుకే, రాజ‌కీయంగా ఆయ‌న వ‌ద్ద‌ ఎదిగిన వాళ్లు కూడా ఇప్పుడు చంద్ర‌బాబు వైపు వేలెత్తిచూప‌గ‌లుగుతున్నారు.

Also Read : Political Proffessor CBN : రాయ‌ల‌సీమ‌ద్రోహి జ‌గ‌న్ టైటిల్ తో చంద్ర‌బాబు `PPT`

స‌మ‌కాలీన రాజ‌కీయాల్లో ప్ర‌త్య‌ర్థుల‌ను శ‌త్రువులుగా చూస్తూ దర్యాప్తు సంస్థ‌ల‌ను వాళ్ల‌పై ఉసిగొల్పుతున్నారు. రాజ‌కీయాన్ని ఒక యుద్ధం మాదిరిగా మార్చేశారు. ప్ర‌త్య‌ర్థులు లేకుండా చేయాల‌ని అధికార దుర్వినియోగం చేస్తున్నారు. కానీ, ఆనాడు చంద్ర‌బాబు ఎన్నిక‌లప్పుడే రాజ‌కీయాలు మిగిలిన రోజుల్లో రాష్ట్రాభివృద్ధి గురించి చ‌ర్చ జ‌ర‌గాల‌ని రాజ‌కీయాన్ని న‌డిపారు. స‌మ‌కాలీన రాజ‌కీయాల‌ను చూస్తోన్న వాళ్లు చంద్ర‌బాబు (Master CBN)రాజ‌కీయంగా ప‌నికిరాడ‌ని భావిస్తుంటారు. ఆయ‌న పొలిటీషియ‌న్ గా ఫెయిల్ అయ్యార‌ని, రాష్ట్ర‌భివృద్ధి కోసం సీఈవో త‌ర‌హాలో ప‌నిచేసిన ఒక అడ్మినిస్ట్రేట‌ర్ అంటారు. అంతేకాదు, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, చంద్ర‌బాబు మ‌ధ్య వ్య‌త్యాసాన్ని కూడా ప్రైవేటు సంభాష‌ణ‌ల్లో క్యాడ‌ర్ వ్య‌క్త‌ప‌ర‌చుకుంటుంది. ఏమంటే, `జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కోట‌రీలోకి ఎవ‌రైనా వెళ్ల‌గ‌ల‌రు మ‌ళ్లీ తిరిగి రావ‌డం కుద‌ర‌దు. అదే, చంద్ర‌బాబు కోట‌రీలోకి ఎన్నిసార్లైనా వెళ్లొచ్చు, ఎన్నిసార్లైనా తిరిగి రావ‌చ్చు` అంటూ చెప్పుకుంటారు. అందుకే, చంద్ర‌బాబు అడ్మినిస్ట్రేట‌ర్ మాత్ర‌మే పొలిటీషియ‌న్ కాదంటారు విశ్లేష‌కులు.

Also Read : TDP Scheme : మ‌గువ‌కు `మ‌హాశ‌క్తి` చంద్ర‌బాబు