Site icon HashtagU Telugu

Margani Bharat : టీడీపీ మాజీ ఎమ్మెల్సీ కి చెప్పు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చిన వైసీపీ ఎంపీ మార్గాని భరత్

Bharat

Bharat

వైసీపీ ఎంపీ మార్గాని భరత్ (Margani Bharat )..టీడీపీ మాజీ ఎమ్మెల్సీ వార్నింగ్ ఇచ్చాడు..అది కూడా చెప్పు చూపిస్తూ..ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అధికార – ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల తూటలు పేలుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ – వైసీపీ మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. ఈ తరుణంలో ఓ మహిళా వాలంటీర్‌ను టీడీపీ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు (Adireddy Apparao) బెదిరించినట్లుగా ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై వైసీపీ ఎంపీ మార్గాని భరత్ స్పందిస్తూ..అప్పారావు కు వార్నింగ్ ఇచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

రాజమండ్రిలో జరిగిన సిద్ధం సభలో పాల్గొన్న ఎంపీ మార్గాని భరత్ అప్పారావుపై మండిపడ్డారు. బహిరంగ సభలోనే దీనికి సంబంధించిన ఆడియోను వినిపించారు. వాలంటీర్లను ఇలా బెదిరించేవారికి చెప్పు చూపిద్దామని అన్నారు. వాలంటీర్ చెల్లెమ్మను బెదిరించిన వాడిని ఏం చేయాలి.. చెప్పు తీద్దామా.. అని అక్కడే ఉన్న ప్రజలను ఉద్దేశించి మార్గాని భరత్ వ్యాఖ్యలు చేశారు. ఆడపిల్లకు ఫోన్‌ చేసి వార్నింగ్‌ ఇవ్వడం మగతనం కాదన్నారు. నా వాలంటీర్ అక్కచెల్లెళ్లను, అన్నదమ్ముళ్లను సొంత తోబుట్టువుల్లాగా చూసుకుంటానని.. మేమేమీ గాజులు తొడుక్కొని కూర్చోలేదన్నారు. నా వాలంటీర్లు, నా రాజమండ్రి ప్రజల జోలికొస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పొరుగు రాష్ట్రంలో ఉంటూ, ఏపీలో రాజకీయ వ్యాపారం చేస్తున్న చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌లు రాష్ట్రానికి అవసరం లేదని భరత్ , వచ్చే ఎన్నికల్లో దగాకోరు చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలని.. టీడీపీ, జనసేన నేతల కల్లబొల్లి మాటలు నమ్మవద్దని తెలిపారు.

Read Also : Seema Haider : సీమా హైదర్ మాజీ భర్త ..రూ. 3 కోట్లకు నోటీసులు