Site icon HashtagU Telugu

Margani Bharat : మార్గాని భరత్..జగన్ ను అంత మాట అనేశాడేంటి భయ్యా..!!

Margani Bharat Jagan

Margani Bharat Jagan

మార్గాని భరత్ (Margani Bharat)..ఈయన గురించి ఎంత చెప్పిన తక్కువే..అది ఆయన ఫీలింగ్. దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా తానే గొప్ప అనుకునే ఫీలింగ్ లో ఎప్పుడు ఉంటాడు. అంతెందుకు చాల సందర్భాలలో తానో గొప్ప నటుడ్ని అని, పాన్ ఇండియా సినిమాలు చేసే సత్తా తనలో ఉందని..తనముందు ఇప్పుడు ఉన్న హీరోలు కూడా తక్కువే అని చెప్పుకొచ్చాడు. టిక్ టక్ , రీల్స్ వంటి వాటితో కాస్త పేరు తెచ్చుకున్న ఈయన..సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఆ తర్వాత సినిమాల కంటే రాజకీయాలే ఉత్తమమని భావించిన ఆయన వైసీపీ ద్వారా రాజకీయ ప్రవేశం చేశారు. తొలి ప్రయత్నంలోని భారీ మెజారిటీతో ఎంపీగా గెలిచి పార్లమెంట్ అడుగుపెట్టారు. సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడు గా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. గడిచిన ఐదేళ్లలో మీడియా ముందు నానా హడావిడి చేస్తూ నిత్యం వార్తల్లో ఉండాలని ట్రై చేసాడు. ఇక ఎన్నికల సమయంలో ఈయన బిల్డప్ చూసి వామ్మో అనుకున్నవారు లేకపోలేదు. ఆ తర్వాత కూటమి దెబ్బ తో ..దెబ్బకు సైలెంట్ అయ్యాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో తమ పార్టీ అధినేత , మాజీ సీఎం జగన్ (Jagan) ఫై పలు కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచాడు.

We’re now on WhatsApp. Click to Join.

తన ఓటమికి కారణాలు చెపుతూ.. జగన్ చేతకాని తనాన్ని, తెలివి తక్కువ తనాన్ని కాస్త పొలైట్గా తనదైన శైలిలో చెప్పుకొచ్చాడు. వైసీపీ ఓటమికి దెబ్బ లిక్కర్ విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయాలే అన్నారు. ఎందుకంటే జగన్ కు ఏమీ తెలియదు… మనం టూత్ పేస్ట్ కొనేటప్పుడే నాలుగు రకాలు చూస్తాం.. మరి మద్యం కొనేవాడు తనకు ఇష్టమైన బ్రాండ్ కొనుక్కునేందుకు చూడరా అని పేర్కొన్నాడు. ఇంత చిన్న లాజిక్ తనకు అర్థం అయింది కానీ జగన్ కు అర్థం కాలేదని తెలిపాడు. అసలు జగన్ కు మద్యం అలవాటు లేదు కాబట్టి మద్యం బ్రాండ్స్ అనేవి తెలియకుండా పోయాయని చెప్పుకొచ్చాడు.

ఈయన మాటలు విన్న నెటిజన్లు మాత్రం ఆయనకు కాదు ముందు నీకు తెలియదు జగన్ ప్లాన్ అనేది..జగన్ ఐదేళ్లలో ప్రజలకు అందించిన మద్యం మొత్తం వైసీపీ నేతల కంపెనీ లు వారు తయారు చేసిందే అని..వారి పార్టీ కార్యకర్తలే మద్యం దుకాణాల్లో పని చేశారు. కేవలం నగదు లావాదేవీలు నిర్వహించారు. ఇంత పెద్ద స్కాంలో జగన్ పాత్ర ఉంది..అలాంటిది ఆయన కు మద్యం గురించి తెలియదని భరత్ చెప్పడం నవ్వొస్తోందంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

Read Also : Telangana Rains: భారీ వర్షాల కారణంగా నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి