Site icon HashtagU Telugu

Margadarsi Issue : రామోజీ, శైల‌జ‌కు సీఐడీ స‌మ‌న్లు

Margadarsi Issue

Margadarsi Issue

మార్గ‌ద‌ర్శి చైర్మ‌న్ రామోజీరావు, ఎండీ శైల‌జ‌కు మ‌రోసారి ఏపీ సీఐడీ స‌మ‌న్లు(Margadarsi Issue) జారీ చేసింది. ఎక్క‌డ‌కు ర‌మ్మంటే అక్క‌డ‌కు వ‌చ్చి అనుమ‌తి మేర‌కు విచారిస్తామ‌ని స‌మ‌న్ల‌లో(AP CID) పొందుపరిచారు. అంతేకాదు, ఈ వారంలోని బుధవారం, శుక్రవారం వ‌చ్చే సోమవారం, మంగళవారం, ఏప్రిల్ 6 తేదీల్లో విచార‌ణ‌కు ఎప్పుడైనా రావ‌చ్చ‌ని తెలిపింది. హైదరాబాద్‌లోని ఫతే మైదాన్ రోడ్‌లోని వారి నివాసం వ‌ద్ద‌నైనా సీఐడీ కార్పొరేట్ కార్యాలయంలో అందుబాటులో ఉండాల‌ని కోరింది. నాలుగు రోజుల‌ను ఆప్ష‌న్లుగా ఇస్తూ వాటిలో ఏదో ఒక రోజు ఎంపిక చేసి చెప్పాల‌ని సీఐడీ విజ్ఞ‌ప్తి చేసింది.

మార్గ‌ద‌ర్శి చైర్మ‌న్ రామోజీరావు, ఎండీ శైల‌జ‌కు మ‌రోసారి ఏపీ సీఐడీ స‌మ‌న్లు(Margadarsi Issue)

“కేసులోని వాస్తవాల దృష్ట్యా, సమర్థవంతమైన దర్యాప్తు కోసం మరియు మెరుగైన ముగింపుకు రావడానికి, పరిశోధన అధికారిగా ఈ విచార‌ణ అవసరమని భావిస్తున్నాను” అని DSP ర్యాంక్ CID అధికారి స‌మ‌న్ల‌లో తెలిపారు. విచార‌ణ‌కు సహకరించవలసిందిగా అభ్యర్థిస్తూ, IPC సెక్షన్లు 420, 120 – B, 477 (a) 34 మరియు AP ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్, 1999లోని సెక్షన్ 5 కింద బుక్ చేసిన కేసులను ఉటంకిస్తూ, వాళ్ల‌కు అనుకూలమైన తేదీని తెలియజేయవలసిందిగా అభ్యర్థించారు.

కేసులోని వాస్తవాల దృష్ట్యా, సమర్థవంతమైన దర్యాప్తు కోసం

మంగళగిరిలోని సిఐడి పోలీస్ స్టేషన్‌లో (AP CID) చిట్ ఫండ్ చట్టం, 1982లోని సెక్షన్ 76 మరియు 79 కింద బుక్ చేసిన కేసులను కూడా అధికారి ఉదహరించారు. ఇటీవల, సంస్థలోని కొంతమంది ఉద్యోగులను అరెస్టు చేయడంతో సహా, డిపాజిటర్ల డబ్బును మ్యూచువల్ ఫండ్స్ మరియు స్పెక్యులేటివ్ మార్కెట్‌లలోకి వ్యక్తిగత లాభం కోసం మళ్లించడంతో సహా అనేక అక్రమాలకు సంబంధించి మార్గదర్శిపై(Margadarsi Issue) పలు ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేసింది.

Also Read : Margadarshi: ‘మార్గదర్శి’ కి తెలంగాణ హైకోర్టు క్లీన్ చిట్

గ‌త మంగ‌ళ‌వారం మార్గ‌ద‌ర్శి ఇష్యూలో ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవ‌ద్ద‌ని తెలంగాణ హైకోర్టు ఆర్డ‌ర్ ఇచ్చింది. బాధితులు ఎవ‌రూ ఫిర్యాదు లేకుండా విచార‌ణ ఏమిటి? అంటూ ప్ర‌శ్నించింది. అయితే, తాజాగా మ‌రోసారి రామోజీరారావు, శైల‌జ‌కు ఏపీ సీఐడీ స‌మ‌న్లు జారీ చేయ‌డం గ‌మ‌నార్హం. మార్గ‌ద‌ర్శి వ్య‌వ‌హారం స్వ‌ర్గీయ వైఎస్ సీఎంగా ఉన్న‌ప్ప‌టి నుంచి న‌డుస్తోంది. రాజ‌కీయ‌ప‌ర‌మైన కేసుగా మ‌లుపులు తిరుగుతోంది. మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ మార్గ‌ద‌ర్శి ఇష్యూ మీద తొలుత కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఆ త‌రువాత ఆ సంస్థ మీద కేసులు పెట్టారు. ఇప్పుడు మ‌ళ్లీ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి హ‌యాంలో ఏపీ సీఐడీ కేసులు న‌మోదు చేసి స‌మ‌న్ల‌ను జారీ చేసింది.

Also Read : Margadarsi Chit: జ‌గ‌న్ కు తండ్రి `మార్గ‌ద‌ర్శి`నం! ఉండ‌వ‌ల్లి సంబరం!!

Exit mobile version