Site icon HashtagU Telugu

Maoists : చింతూరు ఏజెన్సీలో మావోయిస్టులు దుశ్చర్య..

Maoists Mischief In Chintoo

Maoists Mischief In Chintoo

అల్లూరి సీతారామరాజు జిల్లా(Alluri Sitaramaraju District)లోని చింతూరు ఏజెన్సీ(Chintoor Agency)లో మావోయిస్టులు (Maoists ) దుశ్చర్యకు పాల్పడ్డారు. జాతీయ రహదారిపై వెళ్తున్న కారును ఆపి, కారులో ఉన్న ప్రయాణికులను దింపి, అనంతరం కారును తగులబెట్టారు. ఈ ఘటనతో చింతూరు ఏజెన్సీలో భయాందోళనలు నెలకొన్నాయి. మావోయిస్టుల చర్య స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తున్న పోలీసులు, మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలోనే ఈ దుశ్చర్య జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు.

మావోయిస్టులు ఈ నెల 2 నుండి 9 వరకు వారోత్సవాలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో తమ ఉనికిని చాటుకోవడం కోసం ఈ విధమైన చర్యలకు పాల్పడినట్లు భావిస్తున్నారు. మావోయిస్టుల చేసిన ఈ పనికి జాతీయ రహదారిపై ప్రయాణించే వారిలో భయం నెలకొంది. కారులో ఉన్న ప్రయాణికులను దింపిన తర్వాతనే కారును తగలబెట్టడం ద్వారా వారు మరిన్ని ప్రమాదకర చర్యలకు పాల్పడవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ప్రాంతంలో సాధారణ ప్రజల రక్షణ కోసం పోలీసులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం పోలీసులు ఘటన స్థలాన్ని సందర్శించి, సంఘటనపై పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. మావోయిస్టుల కదలికలపై నిఘా ముమ్మరం చేసిన పోలీసులు, వారిని పట్టుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.

Read Also : CM Revanth Delhi : మూడు రోజుల పాటు ఢిల్లీలో సీఎం రేవంత్ మకాం