Chhattisgarh Encounter : అలిపిరిలో చంద్రబాబుపై దాడి సూత్రధారి హతం.. ఎవరీ కేశవరావు?

నంబాల కేశవరావు(Chhattisgarh Encounter)  శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం జియ్యన్నపేట గ్రామంలో జన్మించాడు.

Published By: HashtagU Telugu Desk
Maoist Leader Nambala Keshava Rao Basava Raju Encounte, chhattisgarh

Chhattisgarh Encounter: మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్‌ బసవరాజు (70) హతమయ్యాడు. ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌ జిల్లా అడవుల్లో జరిగిన ప్రత్యేక ఏరివేత ఆపరేషన్‌లో అతడిని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. బుధవారం ఉదయం జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో మొత్తం 27 మంది మావోయిస్టులు చనిపోయారు.

చంద్రబాబుపై దాడిలో కేశవరావు పాత్ర

  • అలిపిరిలో చంద్రబాబుపై జరిగిన క్లెమోర్ మైన్స్‌ దాడిలో ప్రధాన సూత్రధారి నంబాల కేశవరావు.
  • 2003 అక్టోబరులో నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల బ్రహ్మోత్సవాలకు హాజరయ్యేందుకు బయలుదేరారు. ఈ క్రమంలో అలిపిరి వద్ద మావోయిస్టులు మందుపాతర పేల్చారు. దీంతో చంద్రబాబుకు తీవ్ర గాయాలయ్యాయి.
  • వెంటనే చంద్రబాబును ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు.
  • ఈ ఘటనలో చంద్రబాబు గాయాలతో బయటపడ్డారు.
  • ఈ కేసుపై ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ జరిపి, అప్పటి పీపుల్స్‌వార్‌ అగ్రనేతలు సహా 33 మందిపై ఛార్జిషీట్‌ దాఖలు చేసింది.
  • ఈ కేసులో కొందరు నిర్దోషులుగా బయటపడ్డారు. మరికొందరికి శిక్షపడింది.

Also Read :Drones : కోల్‌కతా గగనతలంలో డ్రోన్ల కలకలం.. రంగంలోకి రక్షణశాఖ

నంబాల కేశవరావు నేపథ్యమిదీ..

  • నంబాల కేశవరావు(Chhattisgarh Encounter)  శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం జియ్యన్నపేట గ్రామంలో జన్మించాడు.
  • ఆయన తండ్రి వాసుదేవరావు ఒక టీచర్.
  • కేశవరావుకు సోదరుడు, ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు.
  • కేశవరావు ప్రాథమిక విద్య స్వగ్రామం జియ్యన్నపేటలోనే జరిగింది.
  • ఆయన తాతగారి ఊరు అయిన టెక్కలి మండలం తలగాంలో హైస్కూల్ విద్య జరిగింది.
  • టెక్కలి జూనియర్ కాలేజీలో ఇంటర్ చదివాడు.
  • కేశవరావు డిగ్రీ రెండో సంవత్సరం చదువుతుండగా వరంగల్‌లో ఉన్న  కాకతీయ రీజినల్‌ ఇంజినీరింగ్‌ కళాశాల (ఆర్‌ఈసీ)లో బీటెక్ సీటు వచ్చింది. దీంతో అక్కడికి వెళ్లి జాయిన్ అయ్యారు.
  • అక్కడ చదువుతుండగానే రాడికల్ విద్యార్ధి సంఘం వైపు అడుగులు వేశారు.
  • 1984లో ఎంటెక్‌ చేస్తుండగా సీపీఐ(ఎంఎల్‌) పీపుల్స్‌వార్‌ గ్రూపు సిద్ధాంతాలు, భావజాలం పట్ల కేశవరావు ఆకర్షితుడు అయ్యాడు.
  • ఎంటెక్‌ చదువును మధ్యలోనే ఆపేసి, ఉద్యమంలో చేరాడు.
  • అప్పటి నుంచి 43 ఏళ్లుగా కేశవరావు అజ్ఞాతంలోనే ఉన్నాడు.
  • నక్సల్‌బరి ఉద్యమంలో చేరాక స్వగ్రామానికి ఎప్పుడూ కేశవరావు రాలేదని గ్రామస్తులు చెబుతున్నారు.

Also Read :Rohit Sharma: ధోనీలా టెస్టులకు వీడ్కోలు చెబుదామనుకున్న రోహిత్.. బీసీసీఐ తిరస్కారం

  Last Updated: 21 May 2025, 05:16 PM IST