Maoists : అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి అడవుల్లో మంగళవారం రాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రంపచోడవరం ఏజెన్సీలోని దేవిపట్నం మండలం కించకూరు–కాకవాడి గండి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టులతో ఎదురు కాల్పులకు దిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ఓ కీలక నేత గాజర్ల రవి అలియాస్ ఉదయ్ ఉన్నట్లు సమాచారం. ఆయన మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు.
కాగా మృతుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారు. వీరిలో ఒకరు ఇటీవల మరణించిన అగ్రనేత చలపతి భార్య రావి వెంకట హరిచైతన్య అలియాస్ అరుణగా గుర్తించారు. మరో మృతురాలు ఛత్తీస్‌గఢ్‌కి చెందిన అంజు అని గుర్తింపు లభించింది. ఉదయ్ స్వస్థలం వరంగల్ జిల్లా వెలిశాల గ్రామం కాగా, అరుణది అనకాపల్లి జిల్లా పెందుర్తికి చెందింది. ఘటనాస్థలిలో భద్రతా బలగాలు మూడు ఏకే 47 రైఫిల్స్‌ను స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల నేపథ్యంలో ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
Bomb Threats : బేగంపేట విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు..బాంబు, డాగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు