Trains Cancelled : రైలు ప్రమాదం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో పలు రైళ్లు రద్దు

Trains Cancelled : విజయనగరం రైలు ప్రమాదం ఎఫెక్ట్ పలు రైళ్ల రాకపోకలపై పడింది.

  • Written By:
  • Publish Date - October 31, 2023 / 10:35 AM IST

Trains Cancelled : విజయనగరం రైలు ప్రమాదం ఎఫెక్ట్ పలు రైళ్ల రాకపోకలపై పడింది. హౌరా- సికింద్రాబాద్‌ మధ్య నడిచే ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌(12703), హవ్‌రా- బెంగళూరు మధ్య నడిచే దురంతో ఎక్స్‌ప్రెస్‌(12245), షాలిమార్‌- హైదరాబాద్‌ మధ్య నడిచే ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌(18045), విశాఖ -గుణుపూర్‌, విశాఖ – రాయగడ, విశాఖ – పలాస మధ్య నడిచే ప్యాసింజర్ రైళ్లను అధికారులు రద్దు చేశారు.విజయనగరం జిల్లా కంటకాపల్లి వద్ద రైలు ప్రమాదం సంభవించిన రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులను అధికారులు 20 గంటల్లో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు. ఆ వెంటనే ట్రయల్ రన్‌లో భాగంగా ట్రాక్ పైనుంచి విశాఖ – విజయనగరం డౌన్‌లైన్ వైపు గూడ్స్ రైలును నడిపారు. అది సక్సెస్ ఫుల్‌గా ట్రాక్ పైనుంచి నడిపింది.అనంతరం ఆ పట్టాలపై నుంచి ప్రశాంతి ఎక్స్ ప్రెస్ సైతం నడిచింది.

We’re now on WhatsApp. Click to Join.

ప్రమాద స్థలంలో అప్ అండ్ డౌన్ లైన్ పనులు పూర్తయ్యాయి. మిడిల్ లైన్ పనులు పూర్తయ్యేసరికి ఇంకా సమయం పడుతుంది. ఈ రూట్‌లో బుధవారం నాటికి అన్ని రైళ్లను పునరుద్ధరించే అవకాశం ఉంది.ఆదివారం రాత్రి విజయనగరం జిల్లా కంటకాపల్లి వద్ద విశాఖ – పలాస ప్యాసింజర్ రైలును విశాఖ – రాయగడ ప్యాసింజర్ ఢీకొన్న ఘటనలో 15 మంది మృతిచెందగా, 100 మందికిపైగా (Trains Cancelled) గాయపడ్డారు.

Also Read: Indira Gandhi : భారత్‌కు అణ్వస్త్రాలిచ్చిన ఐరన్ లేడీ.. ఇందిరాగాంధీ జీవిత విశేషాలివీ